nervous system
-
Health: డొక్క శుద్ధి.. బుర్రకు బుద్ధి!
బలమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ‘గట్ ఫీలింగ్’ అంటుంటారు. అభిప్రాయాలూ, ఆలోచనలు కలగడం మెదడు పని కాబట్టి ఆ మాట మెదడునూ సూచిస్తుంది. గట్ అనే కడుపు (జీర్ణాశయ) భాగాన్ని మెదడుకు ముడిపెట్టే మాటలు ఎందుకోగానీ తెలుగులోనూ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... ‘కడుపులోంచి దుఃఖం తన్నుకువస్తోంది’... ‘కడుపులో ఎంత బాధ దాచుకున్నాడో’... ‘కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు’... ‘ఆ అమ్మకడుపు చల్లగా’... వంటి ప్రయోగాలతో పాటు, నేర్పు, విద్యకు సంబంధించి... చదువు, లెక్కలు వంటివి వస్తే ‘డొక్కశుద్ధి’ ఉందనీ, విద్య లేకపోతే ‘పొట్టకోస్తే అక్షరం ముక్క రాద’నీ... ఇలా ఎన్నో. జీర్ణవ్యవస్థకూ, మెదడు చేసే పనులకూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలతో పాటూ కడుపు ఆరోగ్యం బాగుంటేనే మెదడు ఆలోచనలూ, పూర్తి ఆరోగ్యమూ బాగుటుందని ఆధునిక వైద్యనిపుణులూ పేర్కొంటున్నారు. ఆ ఉదాహరణలను చూద్దాం..కడుపు–మెదడు కనక్షన్ ఇలా..– కడుపు ఖాళీ అవ్వగానే ఖాళీ అయ్యిందంటూ కడుపు మెదడుకు చెబుతుంది. మెదడు ‘గ్రెలిన్’ అనే హార్మోన్ విడుదల చేయగానే ఆకలేస్తుంది – కడుపు నిండగానే ‘జీఎల్పీ–1’ అనే మరో హార్మోన్ విడుదలై ఇక భోజనం చాలనిపిస్తుంది.– తిన్న వెంటనే పేగులకు రక్త ప్రసరణ పెరుగుతుంది.అందుకే తిన్న వెంటనే మందకొడిగా, స్థబ్దంగా మారడానికి ఈ కనెక్షనే కారణం.– ఒత్తిడికీ, లేదా ఆందోళనకూ లోనైనప్పుడు పెద్ద మెదడు నుంచి భిన్నమైన సిగ్నళ్లు వెలువడి రెండో మెదడులా పనిచేసే గట్ బ్రెయిన్ ప్రభావితమవుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందంటే..మెడడు నుంచి వేగస్ నర్వ్ ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్లు పేగులకు వెళ్తాయి. వేగస్ నాడి మెదడుకు కడుపునకూ (గట్కూ) మధ్య టెలిఫోన్ తీగలా పని చేస్తూ ఉంటుంది. దీనికి తోడు పేగులకు కూడా ‘ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్’ అనే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మెదడు నుంచి అందుకునే సమాచారంతో పేగుల్లోని నాడీ వ్యవస్థ ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకునే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలకు గురైనప్పుడు జీర్ణ సమస్యలైన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’, వాంతులు, నీళ్లవిరేచనాలూ, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) లాంటి సమస్యలు తలెత్తుతాయి.గట్ హెల్త్ దెబ్బతింటే..పేగుల్లో కోటానుకోట్ల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే పది పక్కన పధ్నాలుగు సున్నాలు (టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్) సంఖ్య ఎంత పెద్దదో అన్ని సూక్ష్మజీవులుంటాయి. కడుపులోని ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే ‘గట్ మైక్రోబియం’ అంటారు. ఈ గట్ మైక్రోబియమే రోగనిరోధక వ్యవస్థ మొదలు మెటబాలిజం వరకూ శరీరంలోని పలు జీవక్రియావ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉన్నంత కాలం ఎంతటి తీవ్రమైన రుగ్మతలతోనైనా పోరాడటం సాధ్యమవుతుంది. పేగుల్లోని మైక్రోబియం హెచ్చుతగ్గులకు లోనైతే చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ సమస్యలు మొదలుకొని మధుమేహం, ఉబ్బసంలాంటి వాటితో పాటు... చివరకు మానసిక వ్యాధుల బారిన పడతారు. అయితే గట్ హెల్త్ దెబ్బతిని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆలోచనలూ, మానసికారోగ్యాలూ, భావోద్వేగాలు ప్రభావితం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అవేమిటంటే...– యాంటీబయాటిక్స్: వీటితో దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.– ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిడులు, ఆఫీసుల్లో సహోద్యోగుల వల్ల తలెత్తే ఒత్తిడులు, సామాజిక ఒత్తిళ్లు.. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.– ఆందోళన: మానసిక ఆందోళన కలగగానే... గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కు రక్త సరఫరా సక్రమంగా జరగదు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఆందోళనలు లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు (స్ట్రెస్ కెమికల్స్) వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో వ్యాధినిరోధకశక్తి పోరాడలేదు. ఆందోళనలకు గురయ్యేవారిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అదేపనిగా కొనసాగుతుంటే కడుపు, పేగుల్లో పుండ్లు (అల్సర్స్) రావచ్చు. ఒక్కోసారి అక్కడ అల్సర్ మరింతగా పెరిగి కడుపులో రంధ్రం పడవచ్చు.– ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు:సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా డిప్రెషన్, యాంగై్జటీ మొదలవుతాయి. మెదడులోనే ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకునే సెరటోనిన్‌లో 95 శాతం పేగుల్లోనే తయారవుతుంది. అంతేకాదు... సెరటోనిన్, డోపమైన్ అనే ఈ హ్యాపీ హార్మోన్ల తయారీకి తోడ్పడే విటమిన్లు, అమినో యాసిడ్లను... నిజానికి పేగుల్లోని మంచి బ్యాక్టీరియానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే, సెరటోనిన్ కూడా తగ్గి మానసిక సమస్యలూ మొదలవుతాయి.గట్ రక్షణకు పరిష్కార మార్గాలివి..ఆహారపరమైనవి: పెరుగు తినడం వల్ల పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మజ్జిగ, పెరుగు వంటి వాటిని ‘్రపో–బయోటిక్స్’ అంటుంటారు. వీటితో పాటు పీచు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మలబద్దకం ఉండదు. పొద్దున్నే సుఖవిరేచనం అవుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి భోజనంలో మూడింట ఒక వంతు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌లో కివి, ఆఫ్రికాట్లతో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి తరచూ తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా తీసుకోవడం మూడ్స్‌ను బాగు చేస్తుంది. ఇందుకోసం చేపలు తినాలి. ∙వ్యాయామం ఎండార్ఫిన్స్‌ను వెలువరించడం వల్ల హాయి, సంతోషం లాంటి ఫీలింగ్స్ కలిగించడమే కాకుండా కడుపును తేలిగ్గా ఉంచుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకంతో మూడ్స్ చెడిపోతుంటే వైద్యులను సంప్రదించాలి.ఇవి చదవండి: Health: చీకటి పొర చీల్చండి.. -
చిలీని వణికిస్తున్న వింత వైరస్! అల్లాడుతున్న జనం, లక్షణాలివే
శాంటియాగో: గిలాన్ బరే (జీబీఎస్) అని పిలిచే అరుదైన సిండ్రోమ్ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఏమిటీ జీబీ సిండ్రోమ్? ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్) సిండ్రోమ్ ఇది. నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి. ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు, ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే అన్ని వయసులవారికీ దీనితో రిస్కే! కరోనాతోనూ వస్తుంది...! జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్ బర్తో పాటు కోవిడ్ వైరస్ కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది! గుర్తించడమెలా? ప్రధానంగా రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచి్చతంగా పట్టిస్తాయి. ఇవీ లక్షణాలు... జీబీఎస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరొలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే, మెషీన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావచ్చు! ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుకుంటాడు! నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ సలుపుతుంటుంది. ఇతర లక్షణాలు ♦ చూపు తగ్గడం, కంటి కండరాలు దెబ్బ తినడం..మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం ♦ చేతులు, అరికాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టు విపరీతమైన బాధ ♦ విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా రాత్రిపూట ♦ శారీరక, మానసిక సమన్వయ లోపం, నిలకడలేమి ♦ హృదయస్పందన, రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం ♦ జీర్ణాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలు చికిత్స ఉందా? జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిత్థంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
గర్భిణులు కాఫీ తాగడం మంచిదేనా?
ఇటీవల కాలంలో తరచు వినవస్తున్న మాట ‘గర్భిణులు కాఫీ తాగకూడదు!’ అని. బహుశా అది వాట్సప్ లేదా సోషల్ మీడియాలో వ్యాపించిన సందేశాల వల్ల కావచ్చు. ఇంతకీ ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం.. కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ గింజల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని తక్షణ శక్తిని అందించే ఉత్తేజపరిచేషధంగా భావిస్తారు. కాఫీలోని కెఫీన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసి΄ోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫీన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అంతకుమించి గర్భంపై కెఫీన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. మోతాదు మించక΄ోతే ముప్పు లేదు గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రెస్టీషియన్ ్స అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా కప్పు (240 ఎం.ఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే గర్భిణులు రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు. -
రక్త కణాలతోనే నాడీ మూలకణాలు
మెదడుకు రక్తసరఫరా ఆగిపోవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేందుకు జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మానవ రక్తకణాలనే నాడీ మూలకణాలుగా మార్చేయడం.. తద్వారా సరికొత్త మెదడు కణాలను వద్ధి చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. గుండెపోటుతోపాటు నాడీ సంబంధిత సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స కల్పించేందుకు ఈ కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని అంచనా. గతంలోనూ ఇలా సాధారణ కణాలను మూలకణాలుగా మార్చినప్పటికీ పరిశోధనశాలలో మూలకణాలు ఎక్కువ కాలం పాటు ఇతర కణాలుగా ఎదగడం మాత్రం ఇదే తొలిసారి. నాడీ మూలకణాలుగా మార్చగలగడం వల్ల నాడీ వ్యవస్థకు కీలకమైన న్యూరాన్లు, లేదా గ్లియల్ కణాలను తయారు చేయడం వీలవుతుందని గుండెపోటు తరువాత కోలుకుంటున్న వారికి వీటిని అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. మూలకణ పరిశోధనల్లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులోనే వీటిని నేరుగా రోగుల్లో వాడేందుకు అవకాశముందని అంచనా. -
ఉపవాసంతో ఆయుష్షు పెరుగుతుంది
అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉండటం శరీరానికి మంచిదని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఏ రకమైన మేళ్లు జరుగుతాయన్న అంశంపై మాత్రం పెద్దగా స్పష్టత లేదు. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని అణువులు మన నాడీ వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గిస్తూంటుందని జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధన ఒకటి స్పష్టం చేస్తోంది. ఉపవాసం ఉన్నా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా శరీరం చక్కెరలపై ఆధారపడకుండా శరీరంలో ఉండే కొవ్వులను కరిగించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో శరీరంలో కీటోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో హైడ్రాక్సీబ్యూటరైట్ ఒకటి. ఈ కీటోన్లు కణ జీవితకాలాన్ని పెంచుతాయని డాక్టర్ మింగ్ హుయి ఝౌ చేసిన పరిశోధన చెబుతోంది. హైడ్రాక్సీబ్యూటరేట్ కీటోన్లు విభజన ప్రక్రియ ఆగిపోయిన నాడీ వ్యవస్థ కణాలూ మళ్లీ విభజితమయ్యేలా చేస్తాయని ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు తక్కువ అవుతాయని వివరించారు. ఆహారం తీసుకున్నా ఇదే రకమైన ప్రభావం చూపగల పదార్థాన్ని కనుక్కోగలిగితే గుండెజబ్బులతోపాటు అల్జైమర్స్ వంటి జబ్బులను నివారించేందుకు, సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా. -
తడిపే అలవాటు తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్నప్పటి నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? - సునీత, కందుకూరు పెద్దపిల్లలు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా ఆదుర్దాతో ఉంటారు. సాధారణంగా పిల్లల్లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు రాకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతపడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే దాన్ని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు : నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
రుచిలో ధ్వని... ధ్వనిలో వాసన...
మెడిక్షనరీ మనలో పంచేంద్రియాలు వేటి పనిని అవి చేస్తుంటాయి. ముక్కుతో వాసన చూస్తాం. నాలుకతో రుచి చూస్తాం. చర్మంతో స్పర్శను అనుభవిస్తాం. కంటితో దృశ్యాలను చూస్తాం. చెవులతో ధ్వనులను వింటాం. అయితే అరుదుగా కొందరిలో ఇంద్రియాలన్నీ గందరగోళంలో పడిపోతాయి. అలాంటి వాళ్లకు పరిమళం... దృశ్యం ఏకకాలంలో అనుభూతిలోకి వస్తాయి. రుచిలో ధ్వని వినిపిస్తుంది. నాడీ వ్యవస్థలో తలెత్తే అరుదైన లోపం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘సినెస్థేషియా’ అంటారు. ఈ లోపం ఉన్నవాళ్లు మిగిలిన విషయాల్లో మామూలుగానే ఉంటారు. అయితే, ఈ లోపం కారణంగా తమ అనుభవంలోకి వచ్చిన అనుభూతులను కళల ద్వారా వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తారు. -
యోగసాధకులకు మార్గదర్శకంగా...
పుస్తకం యోగసాధనలో వెలుగుకు ఎంతటి ప్రాధాన్యం ఉందో చీకటికీ అంతే ప్రాముఖ్యముంది. అంటే తమస్సు నుంచే తపస్సు అన్నమాట. కుండలినీ శక్తి సహస్రార - ఆజ్ఞ- విశుద్ధ- అనాహత- మణిపూరక- స్వాధిష్ఠాన- మూలాధారాల ద్వారా శక్తిపాత మవుతుంది. తమస్సుకు, తపస్సుకు ఉన్న లింక్ నుంచి వెలుగు పుట్టినట్లే వెలుగుకు వేడిమికీ కూడా లింక్ ఉంది. వెలుగుకు తొలికేంద్రం జ్యోతిర్మయమైన సహస్రారం అయితే వేడిమికి మూలకేంద్రం ప్రకోపనలకు ప్రతిబింబమైన మూలాధారం. భౌతిక జీవనంలో మనం మన వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వంగా మలచుకోగలిగితే మనం సహస్రదళ పద్మాలం అవుతాం. నాడీ వ్యవవస్థ సహస్రార శక్తి సంపన్నం అవుతుంది. మానవ అవతారంలో ఉన్న మనకు స్వప్రజ్ఞ సాధ్యమైందనటానికి నిదర్శనం కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ క్రియలపై పట్టు సాధించగలగటం. తామస ప్రవృత్తి తొలగటం.. మాస్టర్ సి.వి.వి.గా ప్రసిద్ధులైన కంచుపాటి వెంకటరావు వెంకాసామిరావు అందించిన భృక్తరహిత తారక రాజయోగ సాధనలోని ఎన్నో అద్భుతమైన విశేషాలను ‘ప్రజ్ఞాన రహస్యాలు’ పేరిట మాస్టర్ యోగాలయ నిర్వాహకులు డాక్టర్ వాసిలి వసంతకుమార్ గ్రంథస్తం చేశారు. యోగసాధనలో ఉన్న వారికి... ఇది చక్కటి మార్గదర్శక గ్రంథం. ప్రజ్ఞాన రహస్యాలు (హార్డ్ బౌండ్) పుటలు: 160; వెల రూ. 200 ప్రతులకు: యోగాలయ రీసెర్చి సెంటర్, ప్లాట్ నంబర్: 90, కృష్ణా ఎన్క్లేవ్, మిలిటరీ డెయిరీ ఫామ్ రోడ్, తిరుమలగిరి, సికిందరాబాద్- 500 015. ఈ మెయిల్: ఛీటఠ్చ్చిటజీజీఃడ్చజిౌౌ.ఛిౌ.జీ - డి.వి.ఆర్ -
మూడ్‌ను మార్చే కలర్స్
సాక్షి, హైదరాబాద్ : ఇంట్లోని గోడలకు వేసే రంగులు మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఒంట్లోని పల్స్‌రేట్‌ను స్థిమితంగా ఉంచుతాయి. అందుకే నగరంలోని స్టార్స్ హోటళ్లు, స్థితిమంతుల ఇంట్లోనూ రకరకాల రంగుల గోడలు మనకు దర్శనమిస్తాయి. రంగుల్లో ప్రధానంగా కూల్, వామ్ కలర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. వామ్ కలర్స్‌లోని ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చలోని పలు రకాలు ప్రధానంగా మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎరుపు రంగు మనిషిని ఉత్సాహ పర్చడమే కాదు ఉత్తేజితుల్ని చేస్తుంది. ఈ రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మంచిది కాదు. మనుస్సు బాగోలేనప్పుడు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లే ఈ రంగుకు దూరంగా కూర్చోవడం మంచిది. నీలం రంగు శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. అయితే కొన్ని ముదురునీలం రంగులు జాగ్రత్తను సూచిస్తాయి. లివింగ్‌రూమ్, పెద్ద వంట గదిలో ఈ రంగును ఉపయోగించొచ్చు. {పకృతి సహజ శోభిజ వర్ణం ఆకుపచ్చ. ఇది ప్రశాంతతకు, విశ్రాంతికి చిరునామా. ఈ రంగును బెడ్ రూమ్‌లో వినియోగించడం మంచిది. చిన్నారుల గదుల్లో ఏర్పాటు చేయడం వల్ల వారి చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. పసుపు రంగు మెదడులో పాజిటివ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడిలో ఉన్న వారికి ఈ రంగు మంచి ఔషదంగా పనిచేస్తుంది. వంట గది, డైనింగ్, బాత్ రూమ్‌లలో ఈ రంగును ఉపయోగించుకోవచ్చు. ఈ రంగు చిన్నారులలో వ్యతిరేకభావాలను కలిగిస్తుంది. అత్యంత ప్రశాంతమైన రంగు పింక్. ఈ రంగు ప్రేమ, మనసులోని భావాలను పెంపొందించేలా చేస్తుంది. యువత బెడ్రూమ్లలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. సంప్రదాయమైన రంగు తెలుపు. అందుకే పెళ్లిళ్లు, సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ అంశాలలో ఈ రంగును అధికంగా వినియోగిస్తుంటారు. తెలుపు రంగు కోపంగా ఉన్న మూడ్‌ని ప్రశాంతంగా మార్చేస్తుంది. మనకు తెలియకుండానే సాంత్వన చేకూరుతుంది. -
వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..!
మనం ఏ పని చేయాలన్నా అవసరమైనది మన మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండటం. ఆ మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు సక్రమంగా అందడం. అందుకు ఉపయోగపడే అత్యంత కీలకమైన పోషకమే... ‘విటమిన్-బి12’. ఇది కేవలం మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు అందేలా చేయడమే కాదు... రక్తం పుట్టుకలోనూ పాలుపంచుకుంటుంది. ప్రతి కణంలో జరిగే జీవక్రియల్లో భాగస్వామ్యం తీసుకుని డీఎన్ఏ పుట్టుకలో, అమైనో యాసిడ్స్ కార్యకాలాపాల్లో (మెటబాలిజమ్‌లో) పాలుపంచుకుంటుంది. మాంసాహారంలోనే పుష్కలంగా లభించే విటమిన్ బి12... శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కొన్ని సమస్యలు రావడం సాధారణం. వాటిని అధిగమించి, మన నాడీవ్యవస్థనూ, కణాల్లోని జీవక్రియలనూ సక్రమంగా పనిచేయించడం ఎలాగో చెప్పుకుందాం. శాకాహారుల్లో విటమిన్ బి12 ఎందుకు తక్కువ... విటమిన్ బి12ను మొక్కలుగానీ, ఫంగస్గానీ... ఆ మాటకొస్తే జంతువులుగానీ సృష్టించలేవు. కేవలం బ్యాక్టీరియా దాంతో పాటూ ఆర్చియా అనే ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్‌ను సృష్టించగలవు. ఆర్చియా అనేది ఎంత చిన్న జీవి అంటే ఏకకణజీవికంటే కూడా తక్కువ స్థాయి జీవి. ఈ ఏకకణానికి న్యూక్లియస్ (కేంద్రకం) ఉండదు. ఇదొక కణమనీ, కణంలోని భాగాలని అని నిర్దిష్టంగా చెప్పేందుకు వాటి విభాగాలూ, పైపొరలూ కూడా ఉండవు. కానీ బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే ఎంజైముల సంయోగంతో ఈ ప్రపంచంలో విటమిన్-బి12 స్వాభావికంగా తయారవుతుంది. పైగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఇది జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వెలువరించే పదార్థాలతో జంతువులూ ఇలా పరస్పరం సహాయం (సింబయాసిస్) చేసుకుంటూ ఉండే ప్రదేశాలలో మాత్రమే ఈ విటమిన్ పుడుతుంది. అందుకే ఇది జంతుమాంసం, జంతు ఉత్పాదనల వనరులనుంచే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. అందుకే శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో ఇది చాలా తక్కువ. విటమిన్ బి12 లోపం ఉంటే... ⇒ విటమిన్ బి12 లోపం ఉన్నవారు ఎప్పుడూ చాలా అలసటగా, నీరసంగా ఉంటారు. నిస్సత్తువ ఆవరించి ఉన్నట్లుగా ఫీలవుతుంటారు. ⇒ విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కండిషన్‌ను ‘విటమిన్-బి12 అనీమియా’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఎర్రరక్తకణాలంటారు. ఇవి తమ విధిని సక్రమంగా నిర్వహించలేవు. ⇒ విటమిన్-బి12 అనీమియా వల్ల అలసట, నిస్సత్తువలతో పాటు ఒక్కోసారి ఊపిరి సరిగా అందకపోవడం జరగవచ్చు. ⇒ తలనొప్పి, చెవుల్లో ఏదో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మరింత నిర్దిష్టమైన లక్షణాలు : చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుకపూయడం నోట్లో పుండ్లు కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం డిప్రెషన్‌కు లోనుకావడం మతిమరపు రావడం. శాకాహారులతో పాటు... ఇంకా ఎవరెవరిలో తక్కువ... సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో ఇది తక్కువ పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నీషియస్ అనీమియా అనే కండిషన్ ఉన్నవారిలో ఇది తక్కువ. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను సంగ్రహించే సామర్థ్యం లోపిస్తుంది. అందుకే ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ ఇక పొట్ట లోపలిపొర పలచబారిన వారిలోనూ ఇది తక్కువ పొట్టలో పుండ్లు (అల్సర్స్) ఉన్నవారిలో పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ -పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 పాళ్లు తక్కువ. నిర్ధారణ : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపం తెలుసుకుంటారు. ఇక ఎర్రరక్తకణాల సైజ్‌ను బట్టి కూడా విటమిన్ బి12 లోపాన్ని అంచనావేస్తారు. విటమిన్ బి12కు చికిత్స విటమిన్ బి12 తక్కువగా ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయితే... అలాంటి రోగులకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటిగానీ లేదా రెండు నుంచి నాలుగు రోజులకు ఒకటి చొప్పున ఇస్తారు. ఈ విటమిన్ బి12 అంతా కాలేయంలో నిల్వ అయి ఉంటుంది. కొన్ని నెలలపాటు శరీరానికి అవసరమైన జీవక్రియలకోసం శరీరం తన విటమిన్-బి12 అవసరాల కోసం దాన్ని కాలేయం నుంచి తీసుకొని వాడుకుంటుంది. ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... జీవితకాలం పాటు డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో విటమిన్ బి12ను తీసుకుంటూ ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. ఇక కొందరిలో ఇది పెర్నీషియస్ అనీమియా వల్ల కాకుండా పోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎవరికి వారుగా విటమిన్-బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను తీసుకోకూడదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునే వారు ఒకవేళ ఇతర మాత్రలనూ వాడుతుంటే... విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ వాటి కార్యకలాపాలకు అడ్డుపడకుండా చూసేలా డాక్టర్లు మోతాదులను నిర్ణయిస్తారు. నివారణ మాంసాహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది గుడ్లు, సముద్రపు చేపలు, పాలలో ఇది ఎక్కువ. మాంసాహారం తీసుకోడానికి ఇష్టపడని వారు ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు. శాకాహారులు పుష్కలంగా విటమిన్ బి 12 పొందాలంటే... విటమిన్ బి12తో సమృద్ధం చేసిన (విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం పాలలో ఇది ఎక్కువ విటమిన్ బి12తో సమృద్ధం చేసిన కొబ్బరిపాలలోనూ ఇది చాలా ఎక్కువ పులిసిపోయే స్వభావం ఉన్న ఆహారంలోని ఈస్ట్ (న్యూట్రిషనల్ ఈస్ట్)తోనూ ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు విటమిన్ బి12తో సమృద్ధం చేసిన సోయాపాలతో తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సి రేల్స్)లో తక్కువ కొవ్వు ఉన్న పాలు తోడుబెట్టి చేసిన పెరుగులోనూ పాలలోనూ, చీజ్‌లోనూ, వెనిలా ఐస్‌క్రీమ్‌లోనూ విటమిన్ బి12 ఎక్కువ. అందుకే శాకాహారులు పైన పేర్కొన్న ఆహారంపై ఆధారపడవచ్చు. - డాక్టర్ ఎమ్. గోవర్థన్ సీనియర్ ఫిజీషియన్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
సంకల్పమే బలం
నాడీ వ్యవస్థ అదుపు తప్పితే... ఆ పరిస్థితే అనూహ్యం. పెరాలిసిస్ (పక్షవాతం).. జీవితాన్ని శాశ్వత వైకల్యంలోకి నెట్టేసే వ్యాధి ఇది. రకరకాల ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, దుర్వ్యసనాలు వంటివి నగరజీవిని కుదేలు చేస్తున్నాయి. మెదడు నుంచి కీలక అవయవాలకు నాడీ వ్యవస్థ ద్వారా వెళ్లే సంకేతాలు దారి తప్పుతున్నాయి. సంకేతాల చేరవేత ప్రక్రియలో మోత తట్టుకోలేక నరాలు చిట్లిపోతున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పక్షవాతం బాధితులు ఎక్కువగా ఉన్నారు. దృఢ సంకల్పం ఉంటే దుర్వ్యసనాలను మానేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ బి.చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు. పక్షవాతానికి ఇవే కారణాలు... - పొగతాగే వారి సంఖ్య బాగా పెరిగినందునే పక్షవాతం కేసులు ఎక్కువవుతున్నాయి. - ఆకు కూరలు, కూరగాయల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది. అదనంగా ఉప్పు వేసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి అనర్థాలకు గురవుతున్నారు. - ఆల్కహాల్ కారణంగా నరాలు బలహీనంగా మారుతున్నాయి. - నగరంలో ఎక్కువ మంది టెన్షన్ హెడేక్ (ఒత్తిడి కారణంగా తలనొప్పి) బాధితులుగా మారుతున్నారు. ఇది నరాల మీద ఒత్తిడి పెంచి పెరాలసిస్‌కు గురిచేస్తోంది. - చాలామంది అనవసరంగా నెగిటివ్ థింకింగ్ వల్ల ఒత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్, అల్జీమర్, పెరాలసిస్‌కు గురవుతున్నారు. - గతంలో 50-55 ఏళ్ల వయసు దాటితే గానీ పెరాలిసిస్ వచ్చేది కాదు. నగరంలో పలు కారణాల వల్ల 40 ఏళ్లకే పెరాలిసిస్ బారిన పడుతున్నారు. నివారణకు ఈ జాగ్రత్తలు కీలకం... - తక్షణమే ఉప్పు తగ్గించాలి. ఉప్పు తగ్గిస్తే లో-బీపీ వస్తుందనేది అపోహ. రోజుకు ఐదు గ్రాములకు మించి వాడటం మంచిది కాదు. - రోజూ కనీసం 45 నిమిషాలు, వారానికి 5 రోజులు తప్పనిసరిగా నడవాలి. సాధారణంగా మణికట్టు వద్ద పల్స్‌రేటు 60 ఉంటే, నడిచేటప్పుడు 140 ఉండాలి. నెమ్మదిగా నడవడం వల్ల ఫలితం ఉండదు. - నడక బదులు సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు ఆడటం కూడా మంచిదే. - రోజువారీ ఆహారంలో 30 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 30 శాతం పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు వంటివి), 20 శాతం ప్రొటీన్స్ (పప్పులు, పెరుగు, పాలు వంటివి) విధిగా ఉండాలి. మాంసాహారులు మటన్ తినడం తగ్గించి, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. - రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీ మంచిదే. డార్క్ చాక్లెట్, ఆల్మండ్, వాల్నట్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం కూడా మంచిదే. వీటి వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. - రోజూ కొత్తగా ఆలోచించడం, కొత్త రూట్లో ప్రయాణిస్తే జ్ఞాపక శక్తి చురుగ్గా పనిచేస్తుంది. - రోగం వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకొనేకంటే, చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే జీవితకాలం పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రెజెంటేషన్: జి.రామచంద్రారెడ్డి డాక్టర్స్ కాలమ్ -డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్, సెక్రటేరియట్ రోడ్