యోగసాధకులకు మార్గదర్శకంగా...
పుస్తకం
యోగసాధనలో వెలుగుకు ఎంతటి ప్రాధాన్యం ఉందో చీకటికీ అంతే ప్రాముఖ్యముంది. అంటే తమస్సు నుంచే తపస్సు అన్నమాట. కుండలినీ శక్తి సహస్రార - ఆజ్ఞ- విశుద్ధ- అనాహత- మణిపూరక- స్వాధిష్ఠాన- మూలాధారాల ద్వారా శక్తిపాత మవుతుంది. తమస్సుకు, తపస్సుకు ఉన్న లింక్ నుంచి వెలుగు పుట్టినట్లే వెలుగుకు వేడిమికీ కూడా లింక్ ఉంది. వెలుగుకు తొలికేంద్రం జ్యోతిర్మయమైన సహస్రారం అయితే వేడిమికి మూలకేంద్రం ప్రకోపనలకు ప్రతిబింబమైన మూలాధారం. భౌతిక జీవనంలో మనం మన వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వంగా మలచుకోగలిగితే మనం సహస్రదళ పద్మాలం అవుతాం.
నాడీ వ్యవవస్థ సహస్రార శక్తి సంపన్నం అవుతుంది. మానవ అవతారంలో ఉన్న మనకు స్వప్రజ్ఞ సాధ్యమైందనటానికి నిదర్శనం కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ క్రియలపై పట్టు సాధించగలగటం. తామస ప్రవృత్తి తొలగటం.. మాస్టర్ సి.వి.వి.గా ప్రసిద్ధులైన కంచుపాటి వెంకటరావు వెంకాసామిరావు అందించిన భృక్తరహిత తారక రాజయోగ సాధనలోని ఎన్నో అద్భుతమైన విశేషాలను ‘ప్రజ్ఞాన రహస్యాలు’ పేరిట మాస్టర్ యోగాలయ నిర్వాహకులు డాక్టర్ వాసిలి వసంతకుమార్ గ్రంథస్తం చేశారు. యోగసాధనలో ఉన్న వారికి... ఇది చక్కటి మార్గదర్శక గ్రంథం.
ప్రజ్ఞాన రహస్యాలు
(హార్డ్ బౌండ్)
పుటలు: 160; వెల రూ. 200
ప్రతులకు: యోగాలయ రీసెర్చి సెంటర్,
ప్లాట్ నంబర్: 90, కృష్ణా ఎన్‌క్లేవ్,
మిలిటరీ డెయిరీ ఫామ్ రోడ్,
తిరుమలగిరి, సికిందరాబాద్- 500 015.
ఈ మెయిల్: ఛీటఠ్చ్చిటజీజీఃడ్చజిౌౌ.ఛిౌ.జీ
- డి.వి.ఆర్