రక్త కణాలతోనే  నాడీ మూలకణాలు | Damage due to blood transfusions to the brain | Sakshi
Sakshi News home page

రక్త కణాలతోనే  నాడీ మూలకణాలు

Published Wed, Dec 26 2018 1:24 AM | Last Updated on Wed, Dec 26 2018 1:24 AM

Damage due to blood transfusions to the brain - Sakshi

మెదడుకు రక్తసరఫరా ఆగిపోవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేందుకు జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మానవ రక్తకణాలనే నాడీ మూలకణాలుగా మార్చేయడం.. తద్వారా సరికొత్త మెదడు కణాలను వద్ధి చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. గుండెపోటుతోపాటు నాడీ సంబంధిత సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స కల్పించేందుకు ఈ కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని అంచనా.

గతంలోనూ ఇలా సాధారణ కణాలను మూలకణాలుగా మార్చినప్పటికీ పరిశోధనశాలలో మూలకణాలు ఎక్కువ కాలం పాటు ఇతర కణాలుగా ఎదగడం మాత్రం ఇదే తొలిసారి. నాడీ మూలకణాలుగా మార్చగలగడం వల్ల నాడీ వ్యవస్థకు కీలకమైన న్యూరాన్లు, లేదా గ్లియల్‌ కణాలను తయారు చేయడం వీలవుతుందని గుండెపోటు తరువాత కోలుకుంటున్న వారికి వీటిని అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. మూలకణ పరిశోధనల్లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులోనే వీటిని నేరుగా రోగుల్లో వాడేందుకు అవకాశముందని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement