సాక్షి, హైదరాబాద్ : ఇంట్లోని గోడలకు వేసే రంగులు మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఒంట్లోని పల్స్‌రేట్‌ను స్థిమితంగా ఉంచుతాయి. అందుకే నగరంలోని స్టార్స్ హోటళ్లు, స్థితిమంతుల ఇంట్లోనూ రకరకాల రంగుల గోడలు మనకు దర్శనమిస్తాయి. రంగుల్లో ప్రధానంగా కూల్, వామ్ కలర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. వామ్ కలర్స్‌లోని ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చలోని పలు రకాలు ప్రధానంగా మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి.
ఎరుపు రంగు మనిషిని ఉత్సాహ పర్చడమే కాదు ఉత్తేజితుల్ని చేస్తుంది. ఈ రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మంచిది కాదు. మనుస్సు బాగోలేనప్పుడు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లే ఈ రంగుకు దూరంగా కూర్చోవడం మంచిది.
నీలం రంగు శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. అయితే కొన్ని ముదురునీలం రంగులు జాగ్రత్తను సూచిస్తాయి. లివింగ్‌రూమ్, పెద్ద వంట గదిలో ఈ రంగును ఉపయోగించొచ్చు.
{పకృతి సహజ శోభిజ వర్ణం ఆకుపచ్చ. ఇది ప్రశాంతతకు, విశ్రాంతికి చిరునామా. ఈ రంగును బెడ్ రూమ్‌లో వినియోగించడం మంచిది. చిన్నారుల గదుల్లో ఏర్పాటు చేయడం వల్ల వారి చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది.
పసుపు రంగు మెదడులో పాజిటివ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడిలో ఉన్న వారికి ఈ రంగు మంచి ఔషదంగా పనిచేస్తుంది. వంట గది, డైనింగ్, బాత్ రూమ్‌లలో ఈ రంగును ఉపయోగించుకోవచ్చు. ఈ రంగు చిన్నారులలో వ్యతిరేకభావాలను కలిగిస్తుంది.
అత్యంత ప్రశాంతమైన రంగు పింక్. ఈ రంగు ప్రేమ, మనసులోని భావాలను పెంపొందించేలా చేస్తుంది. యువత బెడ్‌రూమ్‌లలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
సంప్రదాయమైన రంగు తెలుపు. అందుకే పెళ్లిళ్లు, సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ అంశాలలో ఈ రంగును అధికంగా వినియోగిస్తుంటారు. తెలుపు రంగు కోపంగా ఉన్న మూడ్‌ని ప్రశాంతంగా మార్చేస్తుంది. మనకు తెలియకుండానే సాంత్వన చేకూరుతుంది.
మూడ్‌ను మార్చే కలర్స్
Published Fri, Sep 25 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement
Advertisement