
రుచిలో ధ్వని... ధ్వనిలో వాసన...
మెడిక్షనరీ
మనలో పంచేంద్రియాలు వేటి పనిని అవి చేస్తుంటాయి. ముక్కుతో వాసన చూస్తాం. నాలుకతో రుచి చూస్తాం. చర్మంతో స్పర్శను అనుభవిస్తాం. కంటితో దృశ్యాలను చూస్తాం. చెవులతో ధ్వనులను వింటాం. అయితే అరుదుగా కొందరిలో ఇంద్రియాలన్నీ గందరగోళంలో పడిపోతాయి. అలాంటి వాళ్లకు పరిమళం... దృశ్యం ఏకకాలంలో అనుభూతిలోకి వస్తాయి.
రుచిలో ధ్వని వినిపిస్తుంది. నాడీ వ్యవస్థలో తలెత్తే అరుదైన లోపం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘సినెస్థేషియా’ అంటారు. ఈ లోపం ఉన్నవాళ్లు మిగిలిన విషయాల్లో మామూలుగానే ఉంటారు. అయితే, ఈ లోపం కారణంగా తమ అనుభవంలోకి వచ్చిన అనుభూతులను కళల ద్వారా వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తారు.