గంగవరం : గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద 108 వాహనంలో ఒక గర్భిణి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పెద్ద ఉగిని గ్రామానికి చెందిన అబూజార్ భార్య ఆల్మాస్ నిండుగర్భిణి. శుక్రవారం నొప్పులు ప్రారం భం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం వచ్చింది. ఆ వాహ నంలో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలి çస్తున్నారు. మార్గమధ్యంలో గండ్రాజుపల్లె వద్ద ఆమె కవలను(ఆడపిల్లలను) ప్రసవించింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది కిషోర్, శివ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment