
లక్ష్మి మృతదేహం
వినుకొండటౌన్: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటన వినుకొండలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి భర్త ఆంజనేయులు చెప్పిన వివరాల మేరకు.. నూజెండ్ల మండలం వీ అప్పాపురం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మి (24)కి కాన్పులు రావడంలో ఈ నెల 12వ తేదీన వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు రోజులపాటు గర్భిణి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు.. గురువారం కాన్పు దగ్గర పడగానే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. దీంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా మధ్యాహ్న సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఫిట్స్ రావడంతో ప్రైవేటు వైద్యులు గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరు వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మి మృతి చెందింది. ప్రభుత్వ వైద్యులు సక్రమంగా వైద్యం చేయకపోవడంతోనే తన భార్య చనిపోయిందని ఆంజనేయులు విలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment