
భువనగిరి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులతో నిండిపోయిన ఓపీ విభాగం
భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్లు ఆలస్యంగా రావడంతో సోమవారం పరీక్షలకు వచ్చిన గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఆస్పత్రి లోని ఓపీ విభాగంలో గర్భిణులకు పరీక్షలు నిర్వహించేందుకు నలుగురు గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. ప్రతి సోమవారం వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వస్తారు. ఇదే క్రమంలో ఆస్పత్రికి ఉదయమే వందల సం ఖ్యలో గర్భిణులు తరలివచ్చారు. నిబంధనల ప్ర కారం డాక్టర్లు ఉదయం 9నుంచి 12గంటల వరకు వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఉద యం 9గంటలకు రావాల్సిన డాక్టర్లు 11గంటల కైనా రాలేదు. దీంతో అప్పటికే చికిత్స కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గర్భిణులు లైన్‌లో నిల్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా 11 గంటల తర్వాత డాక్టర్ రావడంతో గర్భిణులం దరూ ఒక్కసారిగా తోసుకువచ్చి గుంపులుగా చేరారు. గర్భిణులతోపాటు వారి వెంట వచ్చిన బంధువులతో ఓపీ హాల్ నిండిపోయి ఆస్పత్రి ఆవరణలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుర్చీలు సరిపడా లేకపోవడంతో గర్భిణులు గంటల తరబడి నిలబడక తప్పలేదు. ప్రతి సోమ, గురువారం రోజుల్లో గర్భిణుల తాకిడి ఓపీ విభాగంలో అధికంగా ఉంటుంది.
250 మందికి పైగా..
వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి 250కు పైగా గర్భి ణులు వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండగా సోమవారం ఇదరే అం దుబాటులో ఉన్నారు. వారు కూడా ఆలస్యంగా వచ్చారు. దీంతో గంటల తరబడి గర్భిణులు డా క్టర్ల కోసం ఎదురుచూడక తప్పలేదు.
అందరికీ పరీక్షలు నిర్వహించాం
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. ఇందులో ఒకరు సెలవులో ఉన్నారు. మరొకరు చౌటుప్పల్ ఏరియా ఆ స్పత్రిలోని ఓపీ విభాగంలో పని చేసే గైనకాలజిస్టు రాకపోవడంతో అక్కడికి వెళ్లాడు. మిగి లిన ఇద్దరు గైనకాలజిస్టులు ఉదయం లేబర్ రూమ్‌లో మహిళ ప్రసవం కోసం సమయాన్ని కేటాయించారు. దీంతో ఓపీ విభాగానికి వచ్చేసారికి ఆలస్యమైంది. అయినప్పటికీ గర్భిణులందరికీ పరీక్షలు నిర్వహించారు.–కోట్యానాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment