మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): మేడ్చల్‌లోని ఓ బస్తీలో ఉంటున్న 14 ఏళ్ల బాలికకు శివ(22) అనే యువకుడు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియటంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాలిక పక్క ఇంటిలోనే ఉంటున్నట్లు తెలిసింది.