మృత శిశువుతో ప్రియుడి ఇంటి వద్ద.. | swathi wants justice | Sakshi
Sakshi News home page

మృత శిశువుతో ప్రియుడి ఇంటి వద్ద..

Published Mon, Aug 1 2016 9:54 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

చనిపోయిన బిడ్డతో దుర్గారావు ఇంటివద్ద స్వాతి నిరసన

చనిపోయిన బిడ్డతో దుర్గారావు ఇంటివద్ద స్వాతి నిరసన

రణ స్థలం: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు... ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.. గర్భం దాల్చిన ప్రేయసికి ఎబార్షన్‌ చేయించే ప్రయత్నం చేశాడు... పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టడంతో పరారయ్యాడు... ఇప్పుడు ఆ ప్రేయసి మృత శిశువుతో ప్రియుడి ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన ఘటన రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీలో ఆదివారం చోటుచేసుకుంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా గాజువాకలో తల్లితో కలిసి జీవిస్తున్న స్వాతి తన అత్త ఇంటికి వారానికి ఒకసారి వెళ్లేది. అదే ఇంటికి స్వాతికి మామ వరుసైన ఎర్రవరానికి చెందిన చిల్లా దుర్గారావు అనే యువకుడు సైతం వెళ్లేవాడు. వీరి మధ్య ప్రేమపరిమళించింది.
 
శారీర కంగా దగ్గరయ్యారు. దీంతో స్వాతి గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న దుర్గారావు తప్పించుకుంటూ తిరిగాడు. స్వాతికి తెలియకుండా రణస్థలం మండలంలోని చిల్లపేటరాజాం గ్రామానికి చెందిన మరో అమ్మాయిని ఆగస్టు నెలలో వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. విషయం తెలిసిన ప్రేయసి దుర్గారావును నిలదీసింది. ఏడు నెలల గర్భవతినని, తనను పెళ్లిచేసుకోవాలని కోరింది. దీనికి దుర్గారావు ససెమిరా అంటూనే గర్భం పోయేందుకు జూలై 29న మాత్రలు ఇచ్చాడు.

దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. శనివారం రాత్రి మృత శిశువుకు జన్మనిచ్చింది. విషయం స్వాతి కుటుంబ సభ్యులకు తెలియడంతో దుర్గారావును ఫోన్‌లో నిలదీశారు. అనంతరం ఆయన స్పందించకపోవడంతో మృత శివువుతో దుర్గారావు ఇంటివద్ద స్వాతితో కలిసి నిరసనప్రదర్శన చేపట్టారు.  విషయం గ్రామ పెద్దలకు తెలియజేశారు. తమకేమీ తెలియదని, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చారు. చేసిదేలేక స్వాతి కుటుంబ సభ్యులు రణస్థలం పోలీసులను ఆశ్రయించారు. వారు గాజువాకలో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement