రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి | Bharti Singh Says Did Not Know She Was Pregnant For 2 Month | Sakshi
Sakshi News home page

Bharti Singh: రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు

Published Sun, Mar 20 2022 9:17 AM | Last Updated on Sun, Mar 20 2022 12:08 PM

Bharti Singh Says Did Not Know She Was Pregnant For 2 Month - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ హాస్య నటి భారతీ సింగ్‌ త్వరలో తల్లి కాబోతోంది. ఏప్రిల్‌లో తొలి బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ క్రమంలో తన బేబీ బంప్‌ ఫొటోషూట్‌లను షేర్‌ చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో  పాల్గొన్న భారతీ తన ప్రగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు రెండున్నర నెలల వరకు తాను గర్భవతిని అనే విషయం తెలియదని చెప్పి ఆశ్చర్యపరిచింది. 

చదవండి: ఫుడ్‌ డెలివరి బాయ్‌గా మారిన ప్రముఖ హాస్య నటుడు

‘నేను గర్భవతిని అని తెలియక సాధారణంగా ఎలా ఉంటానో అలా ఉన్నాను. రోజువారి కార్యకలాపాలను చేస్తూ షూటింగ్‌లకు హజరయ్యాను. రెండున్నర నెలలు పాటు నేను గర్భవతిని అనే విషయాన్నే గ్రహించలేకపోయాను. దీంతో రోజు ఏం తింటానే అదే ఆహారం తీసుకున్నాను, రన్నింగ్‌ చేశాను, షూటింగ్‌లకు వెళ్లాను. డాన్స్‌ దివానె షోలో డాన్స్‌ కూడా చేశాను. ఈ క్రమంలో ఓ రోజు నాకు అనుమానం వచ్చి పరీక్షించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అప్పుడే నేను గర్భవతిని అని రియలైజ్‌ అయ్యా. ఇదే విషయాన్ని హర్ష్‌కు చెప్పగా.. చాలా సంతోషంగా పడ్డారు. అలా మా జీవితంలో అద్భుతం జరిగింది. త్వరలోనే మేము మా తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది.

చదవండి: నిన్ను గర్వపడేలా చేస్తా నాన్న: సితార

అదే విధంగా నార్మల్‌ డెలివరి కోసం తన డాక్టర్ల సలహా మేరకు రోజు యోగా, వ్యాయమాలు చేస్తున్నానని, అలాగే దాదాపు గంట పాటు వాకింగ్‌ చేస్తున్నట్లు భారతీ పేర్కొంది. కాగా భారతీ సింగ్‌ ప్రముఖ హాస్య నటుడు కపిల్‌ శర్మ కామెడీ షోతో పాపులర్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు, టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తన చిరకాల ప్రేమికుడు హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017లో గోవాలో పెళ్లి చేసుకుంది భారతీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement