Comedian Bharti Singh Hospitalised For Gallbladder Surgery And Emotional About Her Son, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Bharti Singh Health Condition: చిన్న ప్రాబ్లమ్ అనుకుంది.. కానీ ఇప్పుడు సర్జరీ కూడా

Published Fri, May 3 2024 2:02 PM | Last Updated on Fri, May 3 2024 3:23 PM

Comedian Bharti Singh Hospitalised And Emotional About Her Son

ప్రముఖ లేడీ కమెడియన్ భారతి సింగ్ ఆస్పత్రిలో చేరింది. త్వరలో సర్జరీ కూడా జరగనుందని చెప్పి, అభిమానులకు షాకిచ్చింది. అలానే తన రెండేళ్ల కొడుకుని చాలా మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇంతకీ ఈమెకు ఏమైంది? వీడియోలో ఏం చెప్పింది?

హిందీ షోల్లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతి సింగ్.. నటుడు హర్ష్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ని అలరిస్తూనే ఉన్నారు. అలాంటిది సడన్‌గా చేతికి సెలైన్ పెట్టుకుని భారతి సింగ్ కనిపించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)

కొన్నాళ్ల క్రితం తనకు కడుపులో నొప్పిగా అనిపించిందని, అయితే పొట్టలో గ్యాస్ పెరిగిపోయిందని లైట్ తీసుకున్నానని కానీ భరించలేనంత పెయిన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు భారతి సింగ్ చెప్పుకొచ్చింది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తేలిందని పేర్కొంది. త్వరలో తనకు సర్జరీ చేస్తారని క్లారిటీ ఇచ్చింది.

హాస్పిటల్‌లో ఉండటం వల్ల కొడుకుని చాలా మిస్ అవుతున్నానని భారతి సింగ్ చెప్పింది. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయింది. ఇకపోతే ఈమె త్వరగా కోలుకోవాలని వీడియో దిగువన ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌.. కొత్తిల్లు కొన్న ర‌జ‌నీ కూతురు)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement