Bharti Singh
-
ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
ప్రముఖ లేడీ కమెడియన్ భారతి సింగ్ ఆస్పత్రిలో చేరింది. త్వరలో సర్జరీ కూడా జరగనుందని చెప్పి, అభిమానులకు షాకిచ్చింది. అలానే తన రెండేళ్ల కొడుకుని చాలా మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇంతకీ ఈమెకు ఏమైంది? వీడియోలో ఏం చెప్పింది?హిందీ షోల్లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతి సింగ్.. నటుడు హర్ష్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానెల్లో వీడియోలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ని అలరిస్తూనే ఉన్నారు. అలాంటిది సడన్‌గా చేతికి సెలైన్ పెట్టుకుని భారతి సింగ్ కనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)కొన్నాళ్ల క్రితం తనకు కడుపులో నొప్పిగా అనిపించిందని, అయితే పొట్టలో గ్యాస్ పెరిగిపోయిందని లైట్ తీసుకున్నానని కానీ భరించలేనంత పెయిన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు భారతి సింగ్ చెప్పుకొచ్చింది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తేలిందని పేర్కొంది. త్వరలో తనకు సర్జరీ చేస్తారని క్లారిటీ ఇచ్చింది.హాస్పిటల్లో ఉండటం వల్ల కొడుకుని చాలా మిస్ అవుతున్నానని భారతి సింగ్ చెప్పింది. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయింది. ఇకపోతే ఈమె త్వరగా కోలుకోవాలని వీడియో దిగువన ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు) -
శివసేన నేత దారుణ హత్య.. నిందితుడి కారులో కమెడియన్ ఫోటో!
పంజాబ్‌కు చెందిన శివనేత నేత సుధీర్ సూరి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సుధీర్‌ను కాల్చి చంపిన నిందితుడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సందీప్ సింగ్ అలియాస్ సన్నీగా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బట్టల దుకాణం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సందీప్ తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక అతని కారులో బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణిందర్జీత్ సింగ్ బిట్టా ఫోటోలు లభించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. కాగా అమృత్సర్ నగరంలోని గోపాల్ దేవాలయం ఎదుట నిరసన చేస్తున్న శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే శివసేన నేత సుధీర్ చుట్టూ భారీ పోలీసుల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆలయం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విగ్రహ శకలాలు కనిపించగా.. దేవాలయ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి సూరి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. సూరి అయిదుసార్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Punjab #Live : Shiv Sena leader Sudhir Suri shot dead in Amritsar in presence of Police. They were sitting on a dharna outside the temple against the desecration of hindu idols. Security personnel are also stationed with Suri at all times !! + pic.twitter.com/1reGHy5ypT — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 4, 2022 ఇదిలా ఉండగా ఆలయ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తన్నట్లు వెల్లడించారు. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సూరి ఇప్పటికే గ్యాంగ్స్టర్లు కొన్ని రాడికల్ సంస్థల హిట్-లిస్ట్‌లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు వై కేటిగిరీ భద్రత కల్పించామని, ఆయన సెక్యూరిటీలో 12 మందికి పైగా పోలీసులు ఉన్నారని తెలిపారు. -
బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్
Bharti Singh Epic Reply To Trolls: బాలీవుడ్ స్టార్ కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిడ్డను చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సిన ఆమె సెట్స్‌లో అడుగుపెట్టిందని, జన్మనిచ్చిన 12 రోజులకే ఆమె తిరిగి షూటింగ్లో పాల్గొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోజుల బిడ్డనే అలా వదిలేసి డబ్బు కోసం షూటింగ్లో పాల్గొనడం అసలు బాగోలేదు అంటూ ఆమెను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీ సింగ్ ఈ ట్రోల్స్‌పై స్పందించింది. చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు రీసెంట్గా ఖత్రా ఖత్రా షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘పసిబిడ్డ వదిలేసి అప్పుడే వచ్చావా? అంత తొందర ఏముందని చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు రావడం సాధారణమే. కానీ మనం పాజిటీవిటి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అందరిలా.. కొందరికి విశ్రాంతి తీసుకునే పరిస్థితులు లేకపోవచ్చు. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల్లోనే వారు తిరిగి పనిలో నిమగ్నమవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్ తనయుడు అలాగే తన కొడుకును చూసుకునేందుకు ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారని, బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడని స్పష్టం చేసింది. ‘ఖత్రా ఖత్రా షో మా డ్రీమ్ ప్రాజెక్ట్. మేం దాన్ని వదులుకోలేము. ‘‘అందరు ‘బేబీ చాలా చిన్నది.. అలా ఎలా వదిలేసి వస్తుందంటున్నారు’. అయితే నా బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడు. నా కొడుకు స్యయంగా నా పాలనే పట్టిస్తున్నాను’’ అని భారతీ సింగ్ వివరణ ఇచ్చింది. కాగా భారతీ గర్భవతి సమయంలో కూడా షూటింగ్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. చెప్పాలంటే తను బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు వరకూ కూడా షోను హోస్ట్ చేసింది. -
స్టార్ కమెడియన్‌పై ట్రోలింగ్, డబ్బుల కోసం బిడ్డను అలా వదిలేస్తావా?
బాలీవుడ్ స్టార్ కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పసిబిడ్డను చూసుకుంటూ ఆడిస్తూ లాలిస్తూ మురిసిపోవాల్సిన సమయంలో ఆమె సెట్స్‌లో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బాబుకు జన్మనిచ్చిన 12 రోజుల్లోనే తిరిగి వర్క్‌లో నిమగ్నవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కన్నబిడ్డను చూసుకోవాల్సింది పోయి డబ్బుల కోసం అప్పుడే సెట్స్‌కు వెళ్తున్నావా? అని ఆమెను తిట్టిపోస్తున్నారు. కనీసం ఒక నెల రోజులు కూడా ఆగలేకపోయావా? అని ఫైర్ అవుతున్నారు. జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఇట్టే అర్థమైపోతుందిలే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం భారతీ సింగ్‌ను సూపర్ వుమెన్ అని పొగుడుతున్నారు. తను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆమె నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అటు భారతీకి మాత్రం తన బాబును వదిలి రావడం అయిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా కంటపడ్డ ఆమె వర్క్ కమిట్మెంట్స్ వల్ల పసిబిడ్డతో గడపలేకపోతున్నానని బాధపడినట్లు కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్
ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భారతీ - హార్ష్ లింబచియా దంపతులకు ఆదివారం నాడు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కొడుకు పుట్టాడోచ్ అంటూ దంపతులు ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు పరిణీతి చోప్రా, కరణ్ జోహార్, నేహా కక్కర్, అనిత హస్సనందిని, అన్షూర్ కౌర్, అదితి భాటియా, దివ్య అగర్వాల్ తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తనయుడు పుట్టాడంటూ సంతోషంలో మునిగి తేలుతున్న భారతీ అతడి ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. కాగా భారతీ సింగ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ కామెడీ షోతో పాపులర్ అయ్యింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క టీవీ షోలలోనూ పాల్గొంటోంది. ప్రియుడు హర్ష్ లింబాచియాను 2017 డిసెంబర్ 3న పెళ్లాడింది. View this post on Instagram A post shared by Haarsh Limbachiyaa (@haarshlimbachiyaa30) View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen) చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! -
రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి
ప్రముఖ బాలీవుడ్ హాస్య నటి భారతీ సింగ్ త్వరలో తల్లి కాబోతోంది. ఏప్రిల్‌లో తొలి బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ క్రమంలో తన బేబీ బంప్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న భారతీ తన ప్రగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు రెండున్నర నెలల వరకు తాను గర్భవతిని అనే విషయం తెలియదని చెప్పి ఆశ్చర్యపరిచింది. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన ప్రముఖ హాస్య నటుడు ‘నేను గర్భవతిని అని తెలియక సాధారణంగా ఎలా ఉంటానో అలా ఉన్నాను. రోజువారి కార్యకలాపాలను చేస్తూ షూటింగ్‌లకు హజరయ్యాను. రెండున్నర నెలలు పాటు నేను గర్భవతిని అనే విషయాన్నే గ్రహించలేకపోయాను. దీంతో రోజు ఏం తింటానే అదే ఆహారం తీసుకున్నాను, రన్నింగ్ చేశాను, షూటింగ్‌లకు వెళ్లాను. డాన్స్ దివానె షోలో డాన్స్ కూడా చేశాను. ఈ క్రమంలో ఓ రోజు నాకు అనుమానం వచ్చి పరీక్షించుకోగా పాజిటివ్ వచ్చింది. అప్పుడే నేను గర్భవతిని అని రియలైజ్ అయ్యా. ఇదే విషయాన్ని హర్ష్‌కు చెప్పగా.. చాలా సంతోషంగా పడ్డారు. అలా మా జీవితంలో అద్భుతం జరిగింది. త్వరలోనే మేము మా తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: నిన్ను గర్వపడేలా చేస్తా నాన్న: సితార అదే విధంగా నార్మల్ డెలివరి కోసం తన డాక్టర్ల సలహా మేరకు రోజు యోగా, వ్యాయమాలు చేస్తున్నానని, అలాగే దాదాపు గంట పాటు వాకింగ్ చేస్తున్నట్లు భారతీ పేర్కొంది. కాగా భారతీ సింగ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ కామెడీ షోతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు, టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తన చిరకాల ప్రేమికుడు హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017లో గోవాలో పెళ్లి చేసుకుంది భారతీ. View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen) -
బిగ్‌బాస్: శ్రీరామ్ కోసం రంగంలోకి టాప్ కమెడియన్
Comedian Bharti Singh Supports Sreerama Chandra: సింగర్ శ్రీరామచంద్ర.. తెలుగువాడే కానీ తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం లేదు. హిందీలో ఇండియన్ ఐడల్ షో విన్నర్‌గా నిలిచిన తర్వాత అంతా అతడిని గుర్తుపట్టడం ప్రారంభించారు. ఉత్తరాదిలో కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడికి తెలుగువారికి చేరువకావాలన్న ఆశ అలాగే ఉండిపోయింది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి బిగ్‌బాస్ షోను సాధనంగా మార్చుకున్నాడీ సింగర్. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అనవసరంగా తగాదాలు పెట్టుకోకుండా, ఒకవేళ ఎవరైనా కావాలని తగవు పెట్టుకున్నా చిరునవ్వుతోనే సమాధానమిస్తూ మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడు. తాజాగా శ్రీరామ్ కోసం రంగంలోకి దిగిందో పాపులర్ కమెడియన్. శ్రీరామచంద్రకే ఓటేయండంటూ వీడియో చేసింది. 'నా ఫ్రెండ్ శ్రీరామచంద్ర తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. అతడికి ఇదే నా బెస్ట్ విషెస్.. దయచేసి అందరూ శ్రీరామ్‌కే ఓటేయండి' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన శ్రీరామ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అతడికి సపోర్ట్ చేసినందుకు భారతీ సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ మధ్యే బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా శ్రీరామ్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
అప్పిచ్చినవాళ్లు అసభ్యంగా తాకేవారు, నాకప్పుడు అర్థం కాలేదు
Bharti Singh: ఇండస్ట్రీలో అన్ని రకాల వ్యక్తులూ ఉంటారని, కొంతమంది ప్రతిదానికి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తుంటారని కమెడియన్ భారతీ సింగ్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తన తల్లి ఎన్నో క్లిష్ట పరిస్థితులను చవిచూసిందని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ బుల్లితెర షోకు హాజరైన భారతీ తన తల్లి ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడింది. 'కొన్ని ఈవెంట్ల నిర్వాహకులు నీచంగా ప్రవర్తిస్తుంటారు. చేతులతో ఎక్కడెకక్కడో తాకడానికి ప్రయత్నిస్తుంటారు. అది నాకస్సలు నచ్చేది కాదు, కానీ నేనే అనవసరంగా తప్పుగా అనుకుంటున్నానేమోనని నన్ను నేను సముదాయించుకునేదాన్ని. అయితే ఇదంతా నా చిన్నతనంలో జరిగింది. కానీ ఇప్పుడు దానికోసం ఆలోచిస్తే అది ముమ్మాటికీ తప్పే అనిపిస్తోంది. అలాంటివారితో ఫైట్ చేయాలనుంది. అసలేమనుకుంటున్నారు? ఏంటి, ఎక్కడ చూస్తున్నారు? మీ పిచ్చి చేష్టలను మేం చూస్తూ ఊరుకోం, ఇక్కడినుంచి వెళ్లిపోండి అని గట్టిగా చెప్పాలనుంది. ఇప్పుడు ఈ మాటలను నిర్మొహమాటంగా అనగలను, కానీ నా బాల్యంలో నాకంత ధైర్యం లేకపోయింది. ఇది నా చిన్నతనంలో జరిగిన సంఘటన. అప్పుడు మా అమ్మకు 24 ఏళ్లు. మాకు అప్పిచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి అమ్మ చేయి పట్టుకునేవారు, కొందరైతే ఆమె భుజం మీద చేయేసి మాట్లాడేవారు. నాకు భర్త లేడు, చిన్న పిల్లలున్నారు, మీకు సిగ్గుగా అనిపించడం లేదా? నాతో ఇలా నీచంగా ప్రవర్తిస్తారా? అని అమ్మ వాళ్లను తిరిగి ప్రశ్నించేది. వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నాకప్పుడు అర్థం కాలేదు' అంటూ ఎమోషనల్ అయింది భారతీ సింగ్. కాగా ఆమె కపిల్ శర్మ కామెడీ షోతో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
ఆయనతో ఒక్క ఫోటో కూడా లేదు : నటి భావోద్వేగం
సాక్షి,ముంబై: తెరపై హాస్యాన్ని పండిస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చాలామంది నటుల జీవితాల్లో ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంటుంది. ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ తన జీవితంలో అలాంటి మరో కోణాన్ని, విషాదాన్ని ఇటీవల ఒక షోలో షేర్ చేసుకున్నారు. తనకు జీవితంలో మిగిలింది తల్లి ఒక్కతేనని, తండ్రి ప్రేమ దక్కలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న వైనం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మనీష్ పాల్ ఈ వీడియో లింక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, ఆయన ముఖాన్ని కూడా చూడలేదని భారతీ సింగ్ చెప్పు కొచ్చారు. అంతేకాదు ఆయనతో తనకు ఒక్క ఫోటో కూడా లేకుండా పోయిందని వాపోయారు. తన అక్కకు, అన్నకు దక్కిన అదృష్టాన్ని కోల్పోయానన్నారు. అలాగే తమ కుటుంబంలో అందరూ వారి వారి జీవితాల్లో బిజీగా ఉండటం తగిన పప్రేమను పొందలేకపోయానని వ్యాఖ్యానిచారు. అయితే భర్త హర్ష్ లింబాచియాతో ఆ లోటు తనకు తీరిందన్నారు. భర్త ద్వారా తరువాత మాత్రమే ప్రేమ గురించి తెలిసిందని, పురుషుని ప్రేమ తనకు అర్థమైందని పేర్కొన్నారు. కాగా భారతీ సింగ్ తన చిరకాల ప్రేమికుడు హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017 న గోవాలో వివాహం చేసుకున్నారు. మనీష్ పాల్ ఇన్‌స్టాలో పోడ్కాస్ట్ లింక్‌ను షేర్ చేస్తూ హాస్య దిగ్గజం చార్లీ చాప్లిన్ మాటలు “నేను ఎప్పుడూ వర్షాలలో నడవడం ఇష్టపడతాను. ఎందుకంటే నా ఏడుపు ఎవరూ చూడలేరు’’ కోట్ చేశారు. మనల్ని నవ్వించే వ్యక్తులు చాలా గుంభనంగా ఉంటారు. తమ గాయాలను దాచుకుంటారు. అలాంటి వారిలో నవ్వుల రాణి భారతి ఒకరు అనీ, ఆమె తన అనుభవాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. View this post on Instagram A post shared by Maniesh Paul (@manieshpaul) -
ప్రేయసిని పెళ్లాడిన కొరియోగ్రాఫర్
ముంబై: బాలీవుడ్ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాఠక్ ఓ ఇంటి వాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు నిధి మూనీ సింగ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా శుక్రవారం వీరి వివాహం జరిగింది. వరుడు పునీత్ పీచ్ కలర్ శేర్వాణీ ధరించగా.. వధువు నిధి గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోయారు. లోనావాలాలో జరిగిన ఈ వేడుకకు కామెడీ క్వీన్ భారతీ సింగ్- హర్ష్ లింబాచియా దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. (చదవండి: విరుష్క బంధానికి మూడేళ్లు.. జీవితాంతం తోడుగా) ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారతీ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పునీత్- నిధిలకు ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. ఇక డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చిన పునీత్ పాఠక్.. ఆ తర్వాత అదే షోకు సంబంధించిన ఐదో సీజన్లో షోకు జడ్జిగా వ్యవహరించాడు. ఖత్రోంకీ ఖిలాడీ షో విన్నర్‌గా నిలిచిన అతడు.. ఏబీసీడీ సినిమాతో నటుడిగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏబీసీడీ2, నవాబ్జాదే, స్ట్రీట్ డ్యాన్సర్ వంటి సినిమాల్లో నటించాడు. (చదవండి: రియా కోసం తెగ బాధపడిపోతున్నాడు.. కానీ!) -
డ్రగ్స్ కేసు; హాస్యనటికి బెయిల్
ముంబై: బాలీవుడ్లో మొదలైన డ్రగ్స్ దుమారం హిందీ చిత్రసీమలో కల్లోలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన హాస్యనటి భారతీ సింగ్, తమె భర్త హర్ష లింబాచియాలకు బెయిల్ లభించింది. ముంబై కోర్టు సోమవారం వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం వీరి ఇంటి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, భారతీ సింగ్‌తో పాటు లింబాచియాను శనివారం అరెస్ట్ చేసిన విషయం విదితమే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మత్తుమందులు వాడుతున్నవారికి భయం మొదలైంది. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు వరకు ఈ వరుసలో ఉన్నారు. ఇటీవల నటుడు ఆర్జున్ రాంపాల్‌కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో నటులు అరెస్టు కావడం నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తీరని నష్టాల మధ్య ఈ భారం మరింత పెరిగిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఎంత మొగ్గుచూపుతారని అర్థంకాకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జూన్ నెల నుంచి బడా హీరోయిన్లు ఎన్సీబీ కార్యలయం చుట్టూ తిరుగుతున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ మొదలుకొని దీపికా పదుకునే వంటి ఆగ్ర కథానాయికులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇప్పటికే దీపికా విచారణకు రెండుసార్లు ముంబైలోని ఎన్సీబీ కార్యలయానికి హాజరయ్యారు. సుశాంత్ మృతి కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి బైకుల్లా జైలునుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ నటిపై సుశాంత్‌తండ్రి అనేక ఆరోపణలు చేశారు. వీటి నడుమ డ్రగ్స్ కేసులో వీరి హస్తం ఎక్కువగా ఉందని తెలియడంతో అధికారులు విచారణ వేగవంతం చేసి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడం మొదలు పెట్టారు. (చదవండి: అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్) -
కమెడియన్ భార్తీ సింగ్ అరెస్ట్
ముంబై: కమెడియన్ భార్తీ సింగ్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబైలో అరెస్టు చేసింది. శనివారం ఉదయం భార్తీ సింగ్ నివాసం లోఖండావాలా కాంప్లెక్స్‌తోపాటు కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో స్వల్ప మొత్తంలో 86.5 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెతోపాటు, భర్త హర్ష లింబాచియాను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి, ప్రశ్నించారు. విచారణ అనంతరం భార్తీ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నటుడు సుశాంత్ సింగ్ మృతికి, డ్రగ్స్‌కు సంబంధంపై విచారణ జరుపుతున్న ఎన్సీబీ ఇటీవల పలువురు సినీ రంగ ప్రముఖులు, సరఫరా దారులను ప్రశ్నించడంతోపాటు కొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాదారు ఒకరు తెలిపిన సమాచారం ఆధారంగా భార్తీ సింగ్ ఇంటితోపాటు ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లో సోదాలు జరిపామని ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. గంజాయిని వాడినట్లు భార్తీ సింగ్ దంపతులు అంగీకరించారని కూడా ఆయన వెల్లడించారు. భార్తీని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామనీ, లింబాచియా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. చట్ట ప్రకారం..వెయ్యి గ్రాముల వరకు గంజాయి దొరికితే చిన్న మొత్తంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి 6 నెలల జైలు శిక్ష లేదా 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, భార్తీ సింగ్ టీవీల్లో పలు కామెడీ, రియాల్టీ షోల్లో పాల్గొన్నారు. -
ప్రముఖ కమెడియన్ అరెస్ట్
ముంబై : ప్రముఖ కమెడియన్ భారతి సింగ్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం భారతీ సింగ్ ఇంటిపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఆమె ఇంట్లో కొద్ది మొత్తంలో గంజాయి దొరికినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల అనంతరం భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాను అదుపులోకి తీసుకొని ప్రశ్నలు వర్షం కురిపించారు. అనంతరం భారతీ సింగ్‌తో పాటు ఆమె భర్త హర్ష్ లింబాచియాను అరెస్ట్ చేసి ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి తరలించారు. భారతీ సింగ్ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హాస్య నటి
చంఢీగర్ : బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ పంజాబ్, హరియాణా హైకోర్టు తలుపు తట్టారు. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై అమృత్సర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్లో పేర్కొన్నారు. భారతీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హరియాణ హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరపు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు. (చదవండి : చిక్కుల్లో ఆ ముగ్గురు) కాగా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీ సింగ్ క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద అమృత్సర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురూ తమ ముందు హాజరు కావాలని అమృత్సర్ పోలీసులు మూడు వారాల కింద నోటీసులు ఇచ్చారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టును ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25 వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టొద్దని కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. (చదవండి : రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..) -
ముగ్గురు సెలబ్రిటీలపై మూడో కేసు..
చండీగఢ్ : బాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి రవీనా టాండన్, దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌లు మత భావాలకు వ్యతిరేకమైన వ్యాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా వారు వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా వీరిపై మరో కేసు నమోదైంది. మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కంబోజ్నగర్ వాసి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు శనివారం వారిపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-ఎ ప్రకారం వారిపై కేసు నమోదు చేశామని ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ వివేక్ శీల్ సోనీ పేర్కొన్నారు. వీరిపై ఎఫ్ఐర్ నమోదు కావటం ఈ వారంలో మూడోసారి కావడం గమనార్హం. వివిధ సెక్షన్ల కింద ఈ ముగ్గురు బాలీవుడ్ సెలబ్రిటీలుపై కేసు నమోదు చేశామని.. తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృత్సర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. ఈ ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీన్ టాండన్ స్పందిస్తూ.. తాను ఏ మతాన్ని అవమానించినట్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఇదివరకే తెలిపారు. తన సహచర నటులు ఫరా ఖాన్, భారతి సింగ్‌లు సైతం ఎవరిని అవమానించలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మరోవైపు తాము అన్ని మతాలను గౌరవిస్తామని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని హాస్యనటి భారతి సింగ్ అన్నారు. తమ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా గాయపడితే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని భారతి సింగ్ తెలిపారు. -
చిక్కుల్లో ఆ ముగ్గురు
అమృత్సర్: బాలీవుడ్ సెలబ్రిటీలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పంజాబ్‌లో కేసు నమోదైంది. ఒక టెలివిజన్ షోలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఫిర్యాదుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరాఖాన్, భారతి సింగ్ క్రిస్టయన్ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. సంబంధిత షో వీడియో ఫుటేజీని కూడా ఫిర్యాదుదారుడు అందించినట్టు తెలిపారు. 295 -ఏతోపాటు వివిధ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృతసర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. -
ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి..
‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నువ్వులేని జీవితాన్ని అస్సలు ఊహించలేను కూడా. నా ప్రతీ ఆలోచనలో.. ప్రతీ క్షణంలో నువ్వే. నాకంటే నువ్వే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు. చిన్న పిల్లలా నన్ను గారాబం చేస్తావు. నా ప్రతీ కోరికను నెరవేరుస్తావు. నేను మొండిగా ప్రవర్తించినపుడు నచ్చజెప్పుతావు. కేవలం ఏడు జన్మలకే కాదు... ప్రతీ జన్మలోనూ నువ్వే నా భర్తగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ తన భర్త హర్ష్ లింబాచియాపై ఉన్న ప్రేమచాటుకున్నారు. తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెహందీ, సంగీత్, పెళ్లినాటి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. తనపై ఎంతగానో ప్రేమ కురిపిస్తున్నందుకు భర్తకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తే తన సోల్‌మేట్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీ- టౌన్ సెలబ్రిటీలు సహా అభిమానుల నుంచి భారతీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హర్ష్ కూడా ఓ ఫన్నీ ఫొటోను షేర్ చేసి.. ‘రెండేళ్లుగా ఇలాగే ఉంది. అయినా నాకు నచ్చుతుంది’అంటూ క్యాప్షన్ జతచేశాడు. కాగా హిందీ టెలివిజన్ చరిత్రలో భారతీ సింగ్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. టాప్ కమెడియన్‌గా, యాంకర్‌గా పేరు తెచ్చుకున్న భారతీ.. 2017 డిసెంబరు 3న అత్యంత సన్నిహితుల సమక్షంలో తన చిరకాల స్నేహితుడు హర్ష్ లంబాచియాను పెళ్లాడారు. ప్రతీ కార్యక్రమంలో తన భర్తతో కలిసి సందడి చేసే భారతీ.. వీలు చిక్కినప్పుడల్లా తమ బంధం గురించి సెటైర్లు వేస్తూనే భర్త పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటారు. ప్రస్తుతం ఈ జంట ఓ ప్రముఖ చానెల్లో ప్రసారమవుతున్న రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. View this post on Instagram Happy anniversary my soulmate @haarshlimbachiyaa30 ❤️ thankyou so much for everything 😍👍🏻 harsh main tumhare bina aapni life ka AK pal bhi nahi soch sakti 😘main tumse bahut payar karti hoon,aur mujh Se jayada tum mujh Se payar karte ho😍Chote baby ko kaise rakhte hai vaise tumne Mujhe rakha hai aur humesha meri har jid maani hai ❤️main god se yahi kahugi 7 janam nahi har janam maie tum hi mere husband bano 🙏🏽🙏🏽😇😇😘😘❤️❤️#love#haven#babu#soulmate #lifepartner #hubby#2 anniversary #mybestfriend ❤️❤️❤️❤️ A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on Dec 2, 2019 at 2:30pm PST -
బీజేపీ నేత కూతురుకి బలవంతపు పెళ్లి!
భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్‌పై సొంత కూతురే తీవ్ర ఆరోపణలు చేశారు. బలవంతంగా ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ హైకోర్టు ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకనే అజ్ఞాతంలోకి వెళ్లానని తన న్యాయవాది ద్వారా హైకోర్టుకు వివరించారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించమని ధర్మాసనాన్ని వేడుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ విడియోను రిలీజ్ చేశారు. తన కూతురు భారతీసింగ్ తప్పిపోయిందంటూ అక్టోబర్ 16న బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తను మానసిక రుగ్మతతో బాధపడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తన తండ్రి ఆరోపణలను భారతీసింగ్ తీవ్రంగా ఖండించారు. తాను మాససికంగా ఆరోగ్యంగానే ఉన్నానని, తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించి తనకు మెంటల్ అని కుటుంబ సభ్యులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘నేను తప్పిపోలేదు. కావాలనే ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో నాకు బలవంతంగా పెళ్లిచేయాలని చూస్తున్నారు. వేధింపులు తట్టుకోలేకనే బయటకు వచ్చాను. నేను క్షేమంగా, సంతోషంగా ఉన్నాను. నేను ఏ ముస్లింతోనో, క్రిష్టియన్తోనో పారిపోలేదు. ఒక్కదానినే బయటకు వచ్చాను. నాకు ఆ పెళ్లి ఇష్టంలేదు. కుటుంబ సభ్యులతో ప్రాణహానీ ఉంది. దయచేసి రక్షణ కల్పించండి’ అంటూ వీడియో ద్వారా హైకోర్టును వేడుకున్నారు. ఈ ఘటనపై భారతీసింగ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘పుణేలో ఉద్యోగం చేస్తున్న భారతీ సింగ్‌ను ఇటీవల లక్నోకు రప్పించారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని రప్పించి అనంతరం బలవంతపు పెళ్లి చేయాలని చూశారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె వేరే మతం వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. తను ఆరోగ్యంగానే ఉంది‘ అని పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ : సల్మాన్ ‘సీక్రెట్ వైఫ్’ ఎవరంటే..?!
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా హిందీ బిగ్‌బాస్ షో ప్రారంభమయి ఇప్పటికి మూడు వారాలు కావోస్తుంది. ఇన్ని రోజులు తమలోని దూకుడుని చూపిన కంటెస్టెంట్లు ఇక ఇప్పుడు అసలు గేమ్‌ని ప్రారంభించబోతున్నారు. ఎలిమినేషన్ల నుంచి తమను కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. కంటెస్టెంట్లు తమలోని కోపాన్ని తగ్గించుకుని ఇతర హౌస్‌మెట్స్‌తో కలిసి పోవడానికి ప్రయత్నిస్తూ అసలు గేమ్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ షోను మరింత రక్తి కట్టించడానికి కమెడియన్ భారతి సింగ్ బిగ్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అయితే కంటెస్టెంట్‌గా కాకుండా.. సల్మాన్ ‘సీక్రెట్ వైఫ్’గా ఎంట్రీ హౌస్‌లోకి భారతి ఇవ్వనున్నారంటా. ఈ విషయం గురించి షో నిర్వాకుల్లో ఒకరు మాట్లాడుతూ ‘భారతి 9 మంది పిల్లలతో కలిసి హౌస్‌లో సందడి చేయనున్నారు. ఈ 9 మంది పిల్లలు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించిన 9 బిగ్‌బాస్ సీజన్లకు ప్రతీక. ఈ తొమ్మిది మంది పిల్లల్లో ఒకరు సంజయ్ దత్ పాత్రలో కనిపిస్తారు. ఎందుకంటే సీజన్ 5లో సల్మాన్, సంజయ్ ఇద్దరు హోస్ట్ చేశారు’ అని తెలిపారు. అయితే బిగ్ బాస్ 12 ప్రారంభంలో భారతి సింగ్ తన భర్త హర్ష్ లింబాచియాతో కలిసి ఈ సీజన్ బిగ్‌బాస్ షోలో పాల్గొంటారనే వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే ఈ దంపతులు బిగ్‌బాస్ 12 లాంచింగ్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. కానీ వారు వచ్చింది షోలో పాల్గొనడానికి కాదని.. షోను ప్రమోట్ చేయడానికి తరువాత తెలిసింది. -
బిగ్‌బాస్: ఆ కంటెస్టెంట్‌కు వారానికి 30 లక్షలు
ప్రస్తుతం దేశమంతటా ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర రియాలిటీ షో 'బిగ్‌బాస్'. ఈ షో హిందీ వర్షన్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 11సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న హిందీ 'బిగ్‌బాస్'..12వ సీజన్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం తాజాగా బిగ్‌బాస్ 12 సీజన్ గోవాలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ షో ప్రారంభానికి ముందే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు, వారి పారితోషకాల గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు హీనా ఖాన్, దీపికా కకార్లు ఈ రియాల్టీ షోలో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిగా రికార్డు సృష్టించారు. అయితే తాజా సీజన్లో బాలీవుడ్ నటి, కమెడియన్ భారతి సింగ్ ఆ రికార్డును తిరగరాశారు. తాజా సీజన్లో పాల్గొనే సెలబ్రిటీ జోడి భారతి సింగ్- హార్ష్ లింబాచియాలు వారానికి ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. వారు అడిగిన భారీ మొత్తానికి షో నిర్వాహకులు కూడా అంగీకరించారని తెలిసింది. భారతి సింగ్‌కు వారానికి 30 లక్షలకు పైగా, ఆమె భర్త హార్ష్కు 15 లక్షలకు పైగా పారితోషికం అందనుంది. ఇప్పటివరకు అత్యధికంగా నటి దీపికా కకార్ వారానికి 14-16 లక్షలు, హీనా ఖాన్ 7 నుంచి 8 లక్షల పారితోషకం తీసుకున్నారు. -
అమ్మ నన్ను వద్దనుకుంది : నటి
బాలీవుడ్లో యాంకర్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరి ముఖాల్లో నవ్వులు తెప్పించే భారతి సెలబ్రిటీ స్టేటస్ అందుకోవడానికి ఎంతో కష్టపడ్డారట. ఒక టీవీ షోలో పాల్గొన్న భారతి.. బాల్యంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ‘ఆడపిల్లనని తెలియగానే గర్భంలో ఉన్నపుడే మా అమ్మ అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. అప్పుడు మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఎందుకనో ఆ ఆలోచనను అమలు చేయలేకపోయిందంటూ’ భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మంటే తనకెంతో ఇష్టమని, తన ప్రతీ విజయం వెనుక ఆమె ఉందని, తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఆమేనని భారతీ సింగ్ చెప్పుకొచ్చారు. -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ కపుల్
న్యూఢిల్లీ : స్టార్ కపుల్ భారతి సింగ్, హార్ష్ లింబాచియాల వివాహానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రీ వెడ్డింగ్ షూట్లో దిగిన ఓ ఫొటోను జత చేస్తూ డిసెంబర్ మూడో తేదీన పెళ్లి జరగబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా భారతి సింగ్ ప్రకటించారు. He stole my heart and I am stealing his surname on 3rd December #savethedate #weddingdiaries #weddingbells #love 📸: @luvisrani @israniphotography Styledby: @stylebysugandhasood A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on Oct 28, 2017 at 12:07am PDT 'అతను నా మనసును దొంగిలించాడు. డిసెంబర్ 3న నేను అతని ఇంటిపేరును దోచుకోబోతున్నాను' అని ఫొటోకు కాప్షన్ కూడా పెట్టారు. ఈ జంట పెళ్లి గోవాలో జరగబోతున్నట్లు సమాచారం. A post shared by Haarsh Limbachiyaa (@haarshlimbachiyaa30) on Oct 28, 2017 at 12:27am PDT -
కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!