Comedian Bharti Singh Supports Sreerama Chandra: సింగర్ శ్రీరామచంద్ర.. తెలుగువాడే కానీ తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం లేదు. హిందీలో ఇండియన్ ఐడల్ షో విన్నర్‌గా నిలిచిన తర్వాత అంతా అతడిని గుర్తుపట్టడం ప్రారంభించారు. ఉత్తరాదిలో కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడికి తెలుగువారికి చేరువకావాలన్న ఆశ అలాగే ఉండిపోయింది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి బిగ్‌బాస్ షోను సాధనంగా మార్చుకున్నాడీ సింగర్. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. అనవసరంగా తగాదాలు పెట్టుకోకుండా, ఒకవేళ ఎవరైనా కావాలని తగవు పెట్టుకున్నా చిరునవ్వుతోనే సమాధానమిస్తూ మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడు.
తాజాగా శ్రీరామ్ కోసం రంగంలోకి దిగిందో పాపులర్ కమెడియన్. శ్రీరామచంద్రకే ఓటేయండంటూ వీడియో చేసింది. 'నా ఫ్రెండ్ శ్రీరామచంద్ర తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. అతడికి ఇదే నా బెస్ట్ విషెస్.. దయచేసి అందరూ శ్రీరామ్‌కే ఓటేయండి' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన శ్రీరామ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అతడికి సపోర్ట్ చేసినందుకు భారతీ సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ మధ్యే బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా శ్రీరామ్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment