బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్‌, స్పందించిన కమెడియన్‌ | Bharti Singh Response On Trolls Who Criticized Her Resuming Work Early | Sakshi
Sakshi News home page

Bharati Singh: ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన కమెడియన్‌ భారతీ సింగ్‌

Published Mon, Apr 18 2022 6:53 PM | Last Updated on Mon, Apr 18 2022 7:02 PM

Bharti Singh Response On Trolls Who Criticized Her Resuming Work Early - Sakshi

Bharti Singh Epic Reply To Trolls: బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ భారతీ సింగ్‌ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిడ్డను చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సిన ఆమె సెట్స్‌లో అడుగుపెట్టిందని, జన్మనిచ్చిన 12 రోజులకే ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోజుల బిడ్డనే అలా వదిలేసి డబ్బు కోసం షూటింగ్‌లో పాల్గొనడం అసలు బాగోలేదు అంటూ ఆమెను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీ సింగ్‌ ఈ ట్రోల్స్‌పై స్పందించింది. 

చదవండి: ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు

రీసెంట్‌గా ఖత్రా ఖత్రా షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘పసిబిడ్డ వదిలేసి అప్పుడే వచ్చావా? అంత తొందర ఏముందని చాలా మంది నన్ను ట్రోల్‌ చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు రావడం సాధారణమే. కానీ మనం పాజిటీవిటి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అందరిలా.. కొందరికి విశ్రాంతి తీసుకునే పరిస్థితులు లేకపోవచ్చు. చాలా మంది వర్కింగ్‌ ఉమెన్స్‌ బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల్లోనే వారు తిరిగి పనిలో నిమగ్నమవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది. 

చదవండి: వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్‌ తనయుడు

అలాగే తన కొడుకును చూసుకునేందుకు ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారని, బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడని స్పష్టం చేసింది. ‘ఖత్రా ఖత్రా షో మా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. మేం దాన్ని వదులుకోలేము. ‘‘అందరు ‘బేబీ చాలా చిన్నది.. అలా ఎలా వదిలేసి వస్తుందంటున్నారు’. అయితే నా బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడు. నా కొడుకు స్యయంగా నా పాలనే పట్టిస్తున్నాను’’ అని భారతీ సింగ్‌ వివరణ ఇచ్చింది. కాగా భారతీ గర్భవతి సమయంలో కూడా షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్‌ బిజీగా ఉంది. చెప్పాలంటే తను బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు వరకూ కూడా షోను హోస్ట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement