బాలీవుడ్ స్టార్ కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పసిబిడ్డను చూసుకుంటూ ఆడిస్తూ లాలిస్తూ మురిసిపోవాల్సిన సమయంలో ఆమె సెట్స్‌లో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బాబుకు జన్మనిచ్చిన 12 రోజుల్లోనే తిరిగి వర్క్‌లో నిమగ్నవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కన్నబిడ్డను చూసుకోవాల్సింది పోయి డబ్బుల కోసం అప్పుడే సెట్స్‌కు వెళ్తున్నావా? అని ఆమెను తిట్టిపోస్తున్నారు.
కనీసం ఒక నెల రోజులు కూడా ఆగలేకపోయావా? అని ఫైర్ అవుతున్నారు. జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఇట్టే అర్థమైపోతుందిలే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం భారతీ సింగ్‌ను సూపర్ వుమెన్ అని పొగుడుతున్నారు. తను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆమె నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అటు భారతీకి మాత్రం తన బాబును వదిలి రావడం అయిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా కంటపడ్డ ఆమె వర్క్ కమిట్‌మెంట్స్ వల్ల పసిబిడ్డతో గడపలేకపోతున్నానని బాధపడినట్లు కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment