Comedian And Host Bharti Singh Welcomes Baby Boy With Her Husband, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Bharti Singh: మగ బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్‌

Apr 4 2022 2:48 PM | Updated on Apr 4 2022 3:27 PM

Comedian Bharti Singh Welcomes Baby Boy - Sakshi

విషయాన్ని సెలబ్రిటీ కపుల్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కొడుకు పుట్టాడోచ్‌ అంటూ దంపతులు ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ప్రముఖ కమెడియన్‌ భారతీ సింగ్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భారతీ - హార్ష్‌ లింబచియా దంపతులకు ఆదివారం నాడు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కొడుకు పుట్టాడోచ్‌ అంటూ దంపతులు ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీనికి బాలీవుడ్‌ సెలబ్రిటీలు పరిణీతి చోప్రా, కరణ్‌ జోహార్‌, నేహా కక్కర్‌, అనిత హస్సనందిని, అన్షూర్‌ కౌర్‌, అదితి భాటియా, దివ్య అగర్వాల్‌ తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తనయుడు పుట్టాడంటూ సంతోషంలో మునిగి తేలుతున్న భారతీ అతడి ఫొటోను మాత్రం రివీల్‌ చేయలేదు.

కాగా భారతీ సింగ్‌ ప్రముఖ హాస్య నటుడు కపిల్‌ శర్మ కామెడీ షోతో పాపులర్‌ అయ్యింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క టీవీ షోలలోనూ పాల్గొంటోంది. ప్రియుడు హర్ష్ లింబాచియాను 2017 డిసెంబర్ 3న పెళ్లాడింది.

చదవండి: టాలీవుడ్‌ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్‌ క్రికెటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement