
ముంబై: కమెడియన్ భార్తీ సింగ్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబైలో అరెస్టు చేసింది. శనివారం ఉదయం భార్తీ సింగ్ నివాసం లోఖండావాలా కాంప్లెక్స్‌తోపాటు కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో స్వల్ప మొత్తంలో 86.5 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెతోపాటు, భర్త హర్ష లింబాచియాను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి, ప్రశ్నించారు. విచారణ అనంతరం భార్తీ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నటుడు సుశాంత్ సింగ్ మృతికి, డ్రగ్స్‌కు సంబంధంపై విచారణ జరుపుతున్న ఎన్‌సీబీ ఇటీవల పలువురు సినీ రంగ ప్రముఖులు, సరఫరా దారులను ప్రశ్నించడంతోపాటు కొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ సరఫరాదారు ఒకరు తెలిపిన సమాచారం ఆధారంగా భార్తీ సింగ్ ఇంటితోపాటు ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లో సోదాలు జరిపామని ఎన్‌సీబీ అధికారి ఒకరు చెప్పారు. గంజాయిని వాడినట్లు భార్తీ సింగ్ దంపతులు అంగీకరించారని కూడా ఆయన వెల్లడించారు. భార్తీని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామనీ, లింబాచియా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. చట్ట ప్రకారం..వెయ్యి గ్రాముల వరకు గంజాయి దొరికితే చిన్న మొత్తంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి 6 నెలల జైలు శిక్ష లేదా 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, భార్తీ సింగ్ టీవీల్లో పలు కామెడీ, రియాల్టీ షోల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment