
Katrina Kaif Team Clarifies Her Pregnant Rumours: గతడాది హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కత్రీనా నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పింక్ కలర్ చుడిదార్‌లో దర్శనమించిన ఆమె కాస్తా బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అది చూసి అంతా ఆమో ప్రెగ్నెంట్ అయ్యింటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో కత్రీనా-వీక్కీలు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా కత్రీనా టీం స్పదించింది. ఈ సందర్భంగా కత్రీనా ప్రెగ్నెంట్? వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి ఎలాంటి గుడ్‌న్యూస్ లేదని, కత్రీనా పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం కత్రీనా-విక్కీలు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలను కత్రీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో కత్రినా, విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కత్రీనా సల్మాన్ ఖాన్‌తో నటించిన టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, ‘జీ లే జరా’ మూవీలతో బీజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment