Katrina Kaif Sparks Pregnancy Rumour Once Again After Attending Salman Khan’s Sister’s Eid Party - Sakshi
Sakshi News home page

Katrina Kaif: పార్టీలో మెరిసిన కత్రినా కైఫ్.. తెరపైకి ప్రెగ్నెన్సీ రూమర్స్!

Published Sun, Apr 23 2023 7:05 PM | Last Updated on Mon, Apr 24 2023 10:42 AM

Katrina Kaif Sparks Pregnancy Rumours Once Again - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్‌ హీరోయిన్‌ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న 2021 డిసెంబర్‌9న రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్‌ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్‌ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్‌లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. 

ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement