pregnat
-
ఆమె ప్రెగ్నెంటా?.. స్టార్ హీరోయిన్‌పై నెటిజన్స్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న 2021 డిసెంబర్9న రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్‌ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్‌లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Solar Eclipse 2023: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు ఈ పనులు చేయొద్దు..!
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఉన్నాయి. ఈ రోజు గర్భిణీలు అసలు బయటకు రాకూడదని ప్రాచీన కాలం నుంచి విశ్వసిస్తున్నారు. గ్రహణం వల్ల కడుపులోని బిడ్డకు హానికరం అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో గర్భంతో ఉన్న మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోజు వాళ్లు ఏమేం చేయకూడదో చెప్పారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.. గ్రహణం వేళ గర్భిణీలు చేయకూడనివి.. ► సూర్యగ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు ఇంటి లోపలే ఉండాలి. ఈ సమయంలో బయటకు వెళ్తే పట్టుబోయే బిడ్డకు, తల్లికి హానికరం అని ప్రాచీన విశ్వాసం. గ్రహణం నీడ మీద పడినా కూడా తల్లీబిడ్డలకు మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ► సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అసలు చూడవద్దు. చూస్తే కళ్లతో పాడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ► గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తినొద్దు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో బాగా ఆకలివేసి తప్పనిసరిగా తినాల్సి వస్తే మాత్రం పండ్లను శుభ్రంగా నీటితో కడిగి తినాలని పెద్దలు సూచిస్తున్నారు. ► గ్రహణం సమయంలో వీరు నిద్ర కూడా పోవద్దు. ► సూదులు, కత్తెర్లు, కత్తులు వంటి వస్తువులను గ్రహణం సమయంలో అసలు ఉపయోగించవద్దు. ఇలా చేస్తే కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ► కత్తులు, పదునైన ఆయుధాలను అసలు ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేస్తే.. బిడ్డ పట్టేటపుడు అవయవాలు చీలి పోతాయి. అంటే శిశువులు పెదాలు చీలి పోయి జన్మించడం వంటివి జరగవచ్చు. ► గ్రహణం సమయంలో శారీ పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు కూడా ధరించకూడదు. ► ఈ సమయంలో గర్భిణీలు దుర్వ గడ్డి(గరికె)పై మంచం వేసుకొని కూర్చుని సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తే మంచిది. ఈ విశ్వాసాలు నిజం కాదని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. గ్రహణం అనేది సహజ చర్యకు విరుద్ధం కాబట్టి కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని, కానీ ఏమేరకు హాని కలుగజేస్తాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేవి వాస్తవం కాదంటున్నారు. కాగా.. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఏప్రిల్ 20న మొదటి, అక్టోబర్ 14న రెండో సూర్యగ్రహణం ఉంది. మే 5-6 మధ్య మొదటి చంద్ర గ్రహణం, అక్టోబర్ 28-29 మధ్య రెండో చంద్ర గ్రహణం ఉన్నాయి. అయితే మొదటి సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, సౌత్, ఈస్ట్ ఆసియా దేశాల్లో మాత్రమే కన్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో కన్పించకవోచ్చని పేర్కొన్నారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
ఆస్పత్రులు కాదన్నాయి: ఆటో దిక్కైంది!
ముంబై : కరోనా వైరస్ భయం కారణంగా కాన్పు చేయటానికి ఆస్పత్రులు వెనకాడటంతో ఆటోలో పాపకు జన్మనిచ్చిందో మహిళ. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై మలద్‌కు చెందిన 29 ఏళ్ల గర్బిణి సంగీత పాల్‌కు బుధవారం ఉదయం నొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త అచంచల్ ఆటోలో ఆమెను గోవింద్ నగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే కరోనా వైరస్ కారణంగా కాన్పు చేయటానికి సదరు ఆసుపత్రి వైద్యులు వెనకడుగు వేశారు. జుహులోని కూపర్ ఆసుపత్రికి వెళ్లవల్సిందిగా సలహా ఇచ్చారు. అచంచల్ ఆ వెంటనే ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. ( వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు ) దానికి తోడు సంగీత పరిస్థితి దిగజారుతుండటంతో ఆటోలోనే ఆమెకు కాన్పు చేయాలని అచంచల్ నిశ్చయించుకున్నాడు. పొరుగింటి మహిళ, ఓ నర్సు సహాయంతో ఆటోలోనే కాన్పు చేయించాడు. సంగీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను దగ్గరిలోని సావంత్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు బొడ్డు తాడును కోసి, వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
గర్భంలోనే సమాధి..!?
చొప్పదండికి చెందిన దంపతులకు మూడేళ్ల క్రితం ఆడశిశువు జన్మించింది. రెండోసారి గర్భం దాల్చగా కరీంనగర్‌లోని ఓ గైనకాలజిస్టు నర్సింగ్‌హోంలో వైద్యసేవలు పొందుతున్నారు. మూడో నెల మొదలు కడుపులో ఉన్నది ఆడా మగా ఎవరో తెలుసుకునేందుకు డాక్టర్‌ను సంప్రందించారు. ఆ డాక్టర్ ముందుగా లింగనిర్ధారణ చేయబోమని, ఇది చట్టరీత్యా నేరమని వివరించింది. అయినా వినిపించుకోకుండా స్కానింగ్ పరీక్షలు చేయకపోతే వేరే హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటామని చెప్పి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో వైద్యురాలు స్కానింగ్ చేసింది. కడుపులో ఉన్నది మళ్లీ అడశిశువు అని స్కానింగ్‌లో తెలిసింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి నగరంలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఎలాంటి అర్హతలు లేకుండానే నిర్వహిస్తున్న ఓ క్లీనిక్‌ను సంప్రదించారు. అక్కడ పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని తల్లి గర్భంలోనే తుంచివేశారు. కరీంనగర్‌హెల్త్: నవ మాసాలు మోసి కని పెంచాల్సిన అమ్మా ఆడపిల్లలు వద్దనుకుంటోంది. తను కూడా ఆడే అనే విషయాన్ని మరిచిపోయి ఆడశిశువుల పట్ల వివక్ష చూపుతోంది. కడుపులో ఉన్న శిశువు ఆడ అని తేలగానే గర్భంలోనే సమాధి చేస్తున్నారు. ఆడపిల్లలను వద్దని వివక్ష చూపడం సరైంది కాదని తెలిసినా గర్భంలోనే తుంచివేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆడపిల్ల వద్దనుకుంటున్న వారికి శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు చేయడం చట్టరీత్యా నేరమని బోర్డులు ప్రదర్శిస్తూనే గట్టుచప్పుడు కాకుండా స్కానింగ్సెంటర్లలో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. కొందరు అర్హత లేకున్నా వైద్యులుగా క్లీనిక్‌లు నడుపుతున్న వారు అబార్షన్లు చేస్తున్నారు. కరీంనగర్లో భ్రూణహత్యలు నిత్యకృత్యాలుగా మారాయని, జనావాసాల మధ్య ఇలాంటి వాటిని నిర్వహిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. బంగారు తల్లి, కల్యాణలక్ష్మి, బేటీ బచావో.. బేటీ పడావో వంటి పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వాలు భ్రూణహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం అధికారులు భ్రూణహత్యల నివారణకు వంద శాతం చర్యలు తీసుకుటుంన్నట్లు పేర్కొంటున్నా జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1991 జనాభా లెక్కల ప్రకారం 0–6 బాలబాలికల నిష్పత్తి 1000 : 981 ఉంటే 2011 జనాభా లెక్కల వరకు 0–6 వయసు గల బాలబాలికల నిష్పత్తి 1000 :937కు పడిపోయింది. 2001 ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1000 :982 ఉంది. ప్రభుత్వం 1994లో గర్భస్థ పిండ ప్రక్రియ నిరోధక చట్టాన్ని(పీఎన్డీటీ) ప్రవేశపెట్టింది. చట్టాలపై అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో నిధులు విడుదల అవుతున్నా బాలికల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు స్కానింగ్సెంటర్లపై పూర్తిగా నిఘా కొరవడింది. వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 140వరకు స్కానింగ్ కేంద్రాలు ఉండగా 52 వేర్వేరు కారణాలతో మూసివేశారు. వీటిలో నాలుగు కేసులు మాత్రమే నమోదైనట్లు సమాచారం. 2017లో కరీంనగర్ మంకమ్మతోటలోని ఓ స్కానింగ్‌సెంటర్‌ను సీపీ కమలాసన్‌రెడ్డి తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కనీసం గర్భిణికి ఎన్నో కాన్పు, గతంలో అబార్షన్లు జరిగాయా, అనే ప్రాథమిక సమాచారం లేకుండానే రికార్డులు నిర్వహించడం వారి డొల్లతనానికి నిదర్శనం. తనిఖీలు చేయని కమిటీలు.. నిత్యకృత్యాలుగా మారిన శిశువు లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను అరికట్టడంలో ఏర్పాటైన కమిటీలు ఏనాడూ స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. భ్రూణహత్యల నివారణకు గతంలో మొబైల్ బృందాలు ఏర్పాటు చేసుకొని స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న సౌకర్యాలు, స్కానింగ్ నిర్వహణ, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం ఆ బృందాలు ఉన్నా, అడ్వయిజరీ కమిటీలు వంటివి ఏర్పాటు చేసిన భ్రూణహత్యలు నివారిండంలో విఫలం అవుతున్నారు. నగరంలోని అన్ని గైనకాలజిస్టు హాస్పిటల్స్‌లో స్కానింగ్ నిర్వహిస్తున్నా నాలుగేళ్లలో ఒక్క కేసు నమోదు చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. చట్టం ఏం చెబుతోంది.. గర్బంలోనే ఆడశిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగనిర్ధారణ నిరోధక చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి గర్భిణి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు, పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తప్ప ఎలాంటి పరిస్థితిలోనూ పరీక్షలు చేయకూడదు. గర్భస్థ శిశు పరీక్షలు నిర్వహించే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఇతర కేంద్రాలు వైద్య, ఆరోగ్య శాఖలో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. శిశు లింగ నిర్ధారణ చేస్తే చర్యలు.. స్కానింగ్ సెంటర్లలో శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 140వరకు శిశు లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉండగా వీటిలో 52 స్కానింగ్ సెంటర్లు మూసేయడం జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా మూసివేయగా, మరికొన్ని కేంద్రాలు తొలగించుకోగా మరికొన్నింటిని మూసేశాం. శిశువు లింగనిర్ధారణ నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. లింగనిర్ధారణ నివారణకు దాదాపు 10మందితో కూడిన అడ్బయిజరీ కమిటీ ఉంది. అందులో డీఎంహెచ్ఓ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, న్యాయవాదితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్కానింగ్ సెంటర్లు నిర్వహించే హాస్పిటల్స్‌లో ఆ గైనకాలజిస్టు కనీసం ఆరు నెలలపాటు స్కానింగ్‌పై శిక్షణ పొంది ఉండాల్సి ఉంది. స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసుకునే వారు తప్పకుండా రిజిష్టర్ చేయించుకోవాలి. నిబంధనలు పాటించని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – డీఎంహెచ్ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు, కరీంనగర్ -
నల్గొండలో దారుణం..చెట్టు కిందే గర్భిణీ ప్రసవం
-
గర్భిణి ఆకతాయి చర్య.. వైరల్..
బీజింగ్: చిన్న పిల్లలు అన్నాక అపుడప్పుడు అనుకోకుండా తప్పులు చేస్తారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులను ఎవరైనా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం నాలుగేళ్ల బాలుడు చేసిన చిన్న తప్పుకు పగబట్టి గాయలయ్యేలా చేసింది. తన కాలు అడ్డుపెట్టి అతడు కిందపడేలా చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే చైనాలోని రెస్టారెంట్‌కి ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి భోజనానికి వెళ్లింది. ఆ బాలుడు రెస్టారెంట్ ఎంట్రీ డోర్ వద్ద ఆడుతూ..అటు ఇటూ తిరుగుతున్నాడు. ఆ రెస్టారెంట్ డోర్‌కి దగ్గరలో ఉన్న ఓ టేబుల్ వద్ద సదరు 7 నెలల గర్భిణి తన భర్తతో కలిసి భోజనం చేస్తోంది. ఈ క్రమంలో ఆ బాలుడు డోర్ వద్ద నుంచి లోపలికి వెళ్తుండగా.. అక్కడ ఉన్న ప్లాస్టిక్ పరదా ఆ మహిళకి తాకి ప్లేట్లో ఉన్న భోజనం ఆమెపై పడింది. దీంతో కోపానికి గురైన మహిళ..మరోసారి డోర్ వైపు వస్తున్న బాలుడికి కాలు అడ్డం పెట్టింది. అది గమనించని బాలుడు వేగంగా వచ్చి మెట్లపై పడిపోయాడు. అక్కడే ఉన్నఆ జంట బాలుడిని లేపడానికి కూడా ప్రయత్నించలేదు. దూరంలో ఉన్న బాలుడి తల్లి వచ్చి బాబుని ఆస్పత్రిలో చేర్చింది. అయితే ఆ బాలుడు తనంతట తానే కింద పడిపోయాడని తల్లి భావించింది. కానీ బాలుడు కోలుకున్నాక అసలు విషయం చెప్పాడు. వెంటనే ఆమె రెస్టారెంట్‌కి వెళ్లి సీసీ కెమోరా దృశ్యాలు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెకు 1000 యువాన్ల (దాదాపు రూ.10,500) జరిమానా కూడా విధించారు. అయితే ఆమె గర్భిణీ అని తెలుసుకున్న బాలుడి తల్లి కేసు విత్‌డ్రా చేసుకుంది. తనకు పిల్లలు ఉన్నారని మానవత్వంతో వదిలేస్తున్నాని ఆమె చైనా మీడియాకు తెలిపారు. ఆ వీడియో చైనాలో వైరల్ కావడంతో నిందితురాలు సిగ్గుతో తలదించుకుంది. వెంటనే ఆస్పత్రికి వచ్చి బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని చెప్పింది. తాను చేసిన పొరపాటును క్షమించాలని బాలుడి తల్లిదండ్రులను కోరింది. -
విద్యార్థినిని గర్భవతిని చేసిన గురువు
-
విద్యార్థినిని గర్భవతిని చేసిన గురువు
నల్లగొండ: విద్యార్థులకు చదువు, బుద్ది చెప్పవలసిన గురువే కీచకుడిగా వ్యవహరించాడు. చిలుకూరు మండలం రామాపురం ఓ గురువు తన విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ విద్యార్థిని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆ బాలికను గర్భవతిని చేశాడు. అంతే కాకుండా ఆ గర్భం తీయించడానికి ప్రయత్నించాడు. ఈ విషయాలు తెలిసి విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. డీఈఓ కలుగజేసుకొని ఆ కీచక గురువుని సస్పెండ్ చేశాడు.