పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజులో బౌలర్లు అధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు.
ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(41), రిషభ్ పంత్ (37), కేఎల్ రాహుల్(26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.
బుమ్ బుమ్ బుమ్రా...
అనంతరం భారత ఫాస్ట్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు ధీటుగా బదులిచ్చారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. అతడిని ఎదుర్కొవడం ఆసీస్ బ్యాటర్ల తరం కాలేదు. అతడి బౌలింగ్ దాటికి కంగారులు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
4 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను బుమ్రా దెబ్బ తీశాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బుమ్రాతో పాటు సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఓ వికెట్ సాధించారు.
72 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఓవరాల్‌గా తొలి రోజు ఆటలో మొత్తం 17 వికెట్లను ఇరు జట్ల బౌలర్లు నేలకూల్చారు. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడడం 1952 తర్వాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌తో 72 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment