నల్లగొండ: విద్యార్థులకు చదువు, బుద్ది చెప్పవలసిన గురువే కీచకుడిగా వ్యవహరించాడు. చిలుకూరు మండలం రామాపురం ఓ గురువు తన విద్యార్థినిని గర్భవతిని చేశాడు.
ఆ విద్యార్థిని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆ బాలికను గర్భవతిని చేశాడు. అంతే కాకుండా ఆ గర్భం తీయించడానికి ప్రయత్నించాడు. ఈ విషయాలు తెలిసి విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. డీఈఓ కలుగజేసుకొని ఆ కీచక గురువుని సస్పెండ్ చేశాడు.