Kajal Aggarwal Shocking Comments About Her Pregnancy Rumours - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ వార్తలపై కాజల్ ప్రకటన

Nov 9 2021 2:48 PM | Updated on Nov 9 2021 9:18 PM

Finally Kajal Aggarwal Opens Up On Her Pregnancy Rumours - Sakshi

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను గతేడాది అక్టోబర్‌ 30న కాజల్‌ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం కాజల్‌ సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కొత్తకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజల్‌ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్‌ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి.

చదవండి: విడాకులపై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్‌ డిలీట్‌

అయితే ఇప్పటికీ ఈ వార్తలపై ఆమె స్పందించకపోవడం అదే నిజం అనుకుంటున్నారంతా. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ తన ప్రెగ్నెంట్‌ విషయంపై స్పందించింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు కాజల్‌ మాట్లాడుతూ.. ‘నా ప్రెగ్నెన్సీ విషయంపై ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తా. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నా చెల్లెలు(నిషా అగర్వాల్‌) తల్లి కాబోతున్నప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్‌ ఫేస్‌ చేసింది.. ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్‌ అవుతుందో దగ్గరుండి గమనించాను’ అని పేర్కొంది.

చదవండి: ప్రభాస్‌ గురించి ట్వీట్‌ చేసిన సన్నీ సింగ్‌, ‘డార్లింగ్‌’ ఫ్యాన్స్‌ ఫైర్‌

ఇక ‘నిషా కుమారుడు ఇషాన్‌తో ఎక్కువ సమయం గడుపుతుంటా. అప్పుడు నేను తనకి తల్లిని అనే భావనతో గడుపుతాను. నా విషయానికి వచ్చేసరికి భిన్నమైన భావన కలుగుతోంది. ఒక్కోసారి తల్లి అవ్వాలనే భావనే నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాను’ అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న ఫ్యాన్స్‌ అంతా త్వరలోనే కాజల్‌ శుభావార్త చెప్పనుందా? అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికోస్తే.. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కాజల్‌ ప్రస్తుతం ఉమ అనే సినిమా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement