ప్రేమిస్తున్నానంటు వెంటపడ్డాడు...నువ్వు లేకుంటే జీవితం లేదన్నాడు.
తిరుమలాయపాలెం: ప్రేమిస్తున్నానంటు వెంటపడ్డాడు...నువ్వు లేకుంటే జీవితం లేదన్నాడు. 5ఏళ్లుగా తన ప్రేమాయణం సాగించాడు. మాయమాటలను చెప్పి యువతిని లొంగతీసుకున్నాడు. గర్భవతి కాగానే తనకు సంబంధం లేదంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన గోళ్ల సంజీవరావు అనే యువకుడు గత 5 ఏళ్ల క్రితం ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, నువ్వు లేకుంటే నేను లేను అంటూ వెంటపడి యువతి ఒప్పించాడు.
ఈ మోసగాడి మాటలతో నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం గర్భవతి కావటంతో ఆమెను వదిలించుకునేందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు. గమనించిన యువతి పెళ్లి చేసుకోమని నిలదీయటంతో తనకు సంబంధం లేదని ఉడాయిస్తున్నాడు. దీంతో యువతి తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.