ఐదేళ్లుగా సహజీవనం చేసి..
ఐదేళ్లుగా సహజీవనం చేసి..
Published Wed, Jul 5 2017 3:40 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
ఖమ్మం: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం గర్భవతిని చేసి మూడు సార్లు గర్భస్రావం చేయించాడు. చివరకు పెళ్లి పేరెత్తితే ముఖం చాటేశాడు. దీంతో ఆ యువకుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది.
వివరాలు.. గ్రామానికి చెందిన వెంకట ప్రవీణ్‌కుమార్(25) హైదరాబాద్‌లో ఎంఫార్మసీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గోలముడి వెంకటరమణ(23) ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో నగరంలోనే ఉంటోంది. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరి మధ్య పదేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. నగరంలో ఒకే గదిలో ఉంటున్న వీరు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
ఈ క్రమంలో వెంకటరమణ మూడు సార్లు గర్భం దాల్చగా.. ఇప్పుడే పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు. కాగా మూడు నెలల క్రితం వీరి మధ్య పెళ్లి విషయంలో వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి ప్రవీణ్‌కుమార్ ముఖం చాటేస్తున్నాడు. దీంతో ఆమె ఈ రోజు ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది
Advertisement
Advertisement