vowed
-
మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్ చేయండి: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్!ఆ తర్వాత..) -
ఇక జీవితంలో మద్యం తాగను : ఎంపీ
చంఢీగడ్ : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ మద్యం మానేస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో మాన్ ఈ ప్రకటన చేశారు. పంజాబ్‌కు చెందిన మాన్ కమెడియన్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆప్‌లో చేరి సంగ్రూర్ ఎంపీగా గెలుపొందారు. అయితే మాన్కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉంది. దీని వల్ల అతను చాలాసార్లు విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ విషయం గురించి మాన్ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడో సందర్భాన్ని బట్టి తాగేవాడిని. కానీ ప్రతిపక్షాలు దీన్ని ఆధారంగా చేసుకుని నన్ను విమర్శించేవారు. మాన్ రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం మత్తులోనే ఉంటాడు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడని ఆరోపించేవారు. అంతేకాక ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా పేరు చెడగొట్టాలని ప్రయత్నించేవారు. ఈ వీడియోలను చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది’ అని వాపోయారు. అంతేకాక ‘మా అమ్మ కూడా నాతో ఇదే విషయం చెప్పింది. నువ్వు ఎప్పుడో ఒకసారి తాగుతావు.. కానీ టీవీల్లో మాత్రం నిత్యం మద్యం సేవిస్తూనే ఉంటావని చూపిస్తున్నారు. ఈ అలవాటును మానుకోకపోతే.. నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి తాగడం మానేయమని కోరారు. దాంతో ఈ జనవరి 1 నేనొక తీర్మానం చేసుకున్నాను. ఇక జీవితంలో మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నాను. ఇకనైనా ప్రతిపక్షాలు నా గురించి తప్పుడు ప్రచారం మానేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపారు. మాన్ నిర్ణయం పట్ల కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మాన్ మార్పుకు పునాది వేశారని కేజ్రీవాల్ కొనియాడారు. -
15 ఏళ్ల తర్వాత చెప్పులు తొడిగాడు..!
భోపాల్ : పార్టీ గెలుపు కోసం నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తలే కృషి చేస్తారు. ఈ క్రమంలో గెలుపు కోసం పూజలు, యాగాలు చేసేవారు కొందరైతే భీష్మ ప్రతిజ్ఞలు చేసేవారు మరి కొందరు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ గెలిస్తేనే గడ్డం గీసుకుంటానని ఓ నాయకుడు.. ఓడిపోతే పీక కోసుకుంటానంటూ మరో నాయకుడు శపథాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్ని జరిగేవి కావని జనాలకు కూడా తెలుసు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కార్యకర్త మాత్రం చేసిన శపథాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏకంగా 15 ఏళ్ల పాటు చెప్పులు లేకుండా తిరిగాడు. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత తిరిగి విజయం సాధించింది. 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు గాను కాంగ్రెస్ కేవలం 38 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అంత ఘోరంగా ఓటమి పాలయ్యంది. ఆ ఫలితాలకు బాధ్యత వహిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని, దశాబ్దం పాటు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని అన్నారు. ఈ క్రమంలోనే దుర్గా లాల్ కిరార్ అనే కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. దాని ప్రకారం ఆయన ఈ 15 ఏళ్లు చెప్పులు లేకుండానే తిరిగారు. ఎట్టకేలకు ఈ ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దుర్గాలాల్ తన 15 ఏళ్ల శపథానికి స్వస్తి పలికారు. బుధవారం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో దుర్గా లాల్ బూట్లు వేసుకున్నారు. ఈ విషయం గురించి కమల్ నాథ్ తన ట్విటర్లో ‘కాంగ్రెస్ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించిన ఇలాంటి కార్యకర్తలందరికి సాల్యూట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
ఐదేళ్లుగా సహజీవనం చేసి..
ఖమ్మం: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం గర్భవతిని చేసి మూడు సార్లు గర్భస్రావం చేయించాడు. చివరకు పెళ్లి పేరెత్తితే ముఖం చాటేశాడు. దీంతో ఆ యువకుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన వెంకట ప్రవీణ్‌కుమార్(25) హైదరాబాద్‌లో ఎంఫార్మసీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గోలముడి వెంకటరమణ(23) ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో నగరంలోనే ఉంటోంది. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరి మధ్య పదేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. నగరంలో ఒకే గదిలో ఉంటున్న వీరు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరమణ మూడు సార్లు గర్భం దాల్చగా.. ఇప్పుడే పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు. కాగా మూడు నెలల క్రితం వీరి మధ్య పెళ్లి విషయంలో వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి ప్రవీణ్‌కుమార్ ముఖం చాటేస్తున్నాడు. దీంతో ఆమె ఈ రోజు ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది -
నీ వయసు చిన్నదని చెప్పినా..
మహబూబాబాద్ రూరల్: తన కన్నా వయసులో చిన్నవాడివని చెప్పినా ఆ యువకుడు వినలేదు. తొలుత ప్రేమ పేరుతో వేధించి మాయమాటలు చెప్పి చివరకు ఆమెను లోబరుచుకున్నాడు. అనంతరం గర్భవతిని చేసి గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత వదిలించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ఇప్పుడు అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. మహబూబాబాద్ శివారులోని ఆకుల లక్ష్మయ్య కాలనీలో సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివామసముంటున్న బోడ సురేష్(22) అనే యువకుడు పీజీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటూ హైదరాబాద్‌లో బ్యుటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న ఓ 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. తనకంటే వయసులో చిన్నవాడివని ఆమె చెప్పినా వినలేదు. చివరకు వారిద్దరి మధ్య తొలుత స్నేహం కుదిరి అనంతరం ప్రేమగా మారింది. ఇలా రెండేళ్లపాటు సాగిన వారి బంధంలో భౌతికంగా కూడా దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి గర్భస్రావం చేయించాడు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడకుండా ముఖం చాటేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ఇంటి ముందు దీక్షకు దిగగా మహిళా సంఘాలు ఆమెకు తమ మద్దతు తెలిపాయి.