
చెన్నై ,టీ.నగర్: యువతిని గర్భవతి చేసిన బాలుడు పోలీసులకు భయపడి మంగళవారం విషం తాగాడు. తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడి సమీపాన పరవాకోటై పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. అక్కడున్న వైద్యులతో వివాహం కాకుండానే గర్భం దాల్చానని, తనకు అబార్షన్ జరపాలని ఆ యువతి కోరింది. దీంతో వైద్యులు ఆమెకు పరీక్షలు జరపగా ఆరునెలల గర్భవతిగా తేలింది. దీని గురించి మన్నార్‌గుడి మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.
పోలీసుల విచారణలో పరవకోటై తోపు వీధికి చెందిన సామియప్పన్ 16ఏళ్ల సోదరుడు తనను వివాహం చేసుకుంటామని చెప్పి మోసగించినట్లు ఆ యువతి తెలిపింది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసి సామియప్పన్ తమ్ముడు మంగళవారం ఉదయం విషం తాగి ఇంటి సమీపాన స్పృహ తప్పాడు. దీంతో అతన్ని వెంటనే మన్నార్‌గుడి ఆస్పత్రిలో చేర్చారు. మరోవైపు పరారీలో ఉన్న సామియప్పన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment