
శిల్పాశెట్టి
సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినీ స్టార్స్ అంటే జనాల్లో ఉండే క్రేజే వేరు. వారి వ్యక్తిగత జీవితాలంటే చాలా ఆసక్తి. ప్రేమ, పెళ్లి, పిల్లలు, లవ్ బ్రేకప్, విడాకులు.. ఇలా ఒక్కటేంటి? స్టార్స్‌కి సంబంధించిన విషయం ఏదైనా జనాలకు వార్తే. ఇక నెట్టింట్లో అయితే సెలబ్రిటీల గురించి పుకార్లు వీర విహారం చేస్తుంటాయి. ఆ నోటా ఈ నోటా పడి ఈ వార్తలు అసలు వాళ్లకు తెలియడం.. వాళ్లు దానిపై క్లారిటీ ఇవ్వడం మమూలే. బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి కూడా ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
బిజినెస్‌మేన్ రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు ఆల్రెడీ వియాన్ రాజ్‌కుంద్రా అనే కొడుకున్నాడు. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. శిల్ప ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నుంచి రిపోర్టులతో బయటకు వస్తున్న ఫొటోను ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. శిల్పా గర్భవతి అని, వైద్య పరీక్షల కోసం క్లినిక్‌కి వెళ్లి వస్తున్నారనీ వార్తలు మొదలయ్యాయి. ‘‘నా జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదు.. నేను గర్భవతిని కాదు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లి వచ్చా’’ అని శిల్పా క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment