
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): తనను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురిచేస్తుండటంతో పెళ్లయిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్ జీవనోపాధి కోసం ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి భార్య గోదావరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదే మండలంలోని తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమె నిత్యం గణేశ్ ట్యాక్సీలోనే స్వగ్రామం వెళ్లేది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడగా సదరు యువతి గణేశ్‌ను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో రెండు రోజులుగా ఇతరులతో ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి, జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గణేశ్ చికిత్స పొందుతున్నాడు. ఆ యువతి నుంచి తనను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నాడు.
చదవండి: హెచ్‌సీయు విద్యార్థి: వీడని విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీ!
Comments
Please login to add a commentAdd a comment