‘ప్రభుత్వంలోని పెద్దల వాహనాలతోనే ప్రమాదాలు’
Published Tue, Feb 28 2017 3:21 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
విజయవాడ: ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెందిన వాహనాలే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు తమ పలుకుబడి వినియోగించి నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా రంగంలో ప్రైవేట్ ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు.
అంతేకాదు, ప్రైవేట్ వాహనాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుతున్నాయని తెలిపారు. చనిపోయిన వారికి చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు ఇస్తామనడం దారుణన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హైవేలపై ప్రమాదాలను నివారించకుండా మొక్కుబడి చర్యలు తీసుకోవటం తగదని అన్నారు.
Advertisement