పెనుగంచిప్రోలు (కృష్ణా) : పిడుగుపాటుతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని శనగపాడు గ్రామంలో వ్యవసాయ పొలంలో పిడుగుపడటంతో ఆ సమయంలో అక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మృతులు రాజారత్నం, విశాక్, సత్యేశ్‌రావులుగా స్థానికులు గుర్తించారు.