దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇది జరిగి 4 రోజులైంది. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రం. ఇంతవరకు న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ, గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ మరణించలేదు. కానీ, ఈ రెండు ప్రమాదాల్లో బస్సులు చిన్న సంస్థలవి కావడం, అధికార పార్టీ నేతలకు చెందినవి కాకపోవడంతో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఇదే వేగాన్ని 10 మందిని బలితీసుకున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘటనపై చూపలేదు. ఈ సంస్థ అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానిది కావడంవల్లే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
Published Sat, Mar 4 2017 7:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement