నగర శివార్లలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. పైడూరుపాడు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా అడ్డదారిలో వెళ్తుండగా పైడూరుపాడు వద్ద బస్సు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మిగతా ప్రయాణికులను గొల్లపూడి నుంచి వేరే బస్సులో తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.