‘‘నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రయాణికుల మృతికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యాలను కాపాడేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. బస్సు నడిపిన డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో పరీక్షలు చేయలేదు. రెండో డ్రైవర్‌ను తప్పించారు. ట్రావెల్స్ యజమానులైన టీడీపీ ఎంపీలకు ముఖ్య మంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘి స్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.