కృష్ణాజిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైఎస్‌ఆర్ సీపీ నేతలపై దాడులు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అన్యాయం చేస్తోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్ ఎందుకు ఉలిక్కిపడ్డారని ఆమె సూటిగా ప్రశ్నించారు.