కడప కేంద్ర కారాగారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి(ఫైల్)
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ల బెయిల్ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై.. జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు. ( జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ )
కాగా, రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్‌తో ఎన్‌ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని వన్‌టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. గత సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలైంది. నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరష్కరించింది. ( మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment