సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగించింది. ప్రస్తుతం కడప జైలులో ఉన్న ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(చదవండి : జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు)
మరోవైపు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై జేసీ వారి నుంచి వివరాలు సేకరించేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఈ పిటిషన్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment