తమిళనాడు: సేలం సమీపంలో రోడ్డుపై వెళ్తున్న బస్సు వెనుక చక్రాలు లేకుండా పరుగులు తీయడంతో కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
సేలం ఎడప్పాడి సమీపంలోని వెల్లండి వలసకు చెందిన విజయన్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను గురువారం సాయంత్రం సేలం కొత్త బస్ స్టేషన్ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులను తీసుకెళ్తుండగా బస్సులో కండక్టర్ కదిర్‌తో సహా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అరియలూర్ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు ముందు భాగం ఒక్కసారిగా పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి పరుగెత్తింది.
ఈ పరిస్థితిలో క్షణాల్లోనే బస్సు వెనుక యాక్సిల్ విరిగిపోవడంతో వెనుక చక్రాలు బస్సు నుంచి విడిపోవడంతో వెనుక టైర్లు లేకుండానే బస్సు కొద్ది దూరం వెళ్లింది. భయంకరమైన శబ్ధం చేస్తూ బస్సు వేగంగా రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.