bus tyre
-
బస్సు వెళ్తుండగా విడిపోయిన చక్రాలు
తమిళనాడు: సేలం సమీపంలో రోడ్డుపై వెళ్తున్న బస్సు వెనుక చక్రాలు లేకుండా పరుగులు తీయడంతో కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సేలం ఎడప్పాడి సమీపంలోని వెల్లండి వలసకు చెందిన విజయన్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను గురువారం సాయంత్రం సేలం కొత్త బస్ స్టేషన్ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులను తీసుకెళ్తుండగా బస్సులో కండక్టర్ కదిర్తో సహా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అరియలూర్ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు ముందు భాగం ఒక్కసారిగా పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి పరుగెత్తింది. ఈ పరిస్థితిలో క్షణాల్లోనే బస్సు వెనుక యాక్సిల్ విరిగిపోవడంతో వెనుక చక్రాలు బస్సు నుంచి విడిపోవడంతో వెనుక టైర్లు లేకుండానే బస్సు కొద్ది దూరం వెళ్లింది. భయంకరమైన శబ్ధం చేస్తూ బస్సు వేగంగా రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
బస్సు టైర్లు పగలి.. ఒక్కసారిగా తీవ్ర విషాదం..
మహబూబ్‌నగర్: మండల పరిధిలోని నాగర్లబండతండాకు చెందిన రాత్లావత్ మంగ్యా (45) సోమవారం నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 4 సంవత్సరాల క్రితం కుటుంబాన్ని పోషించుకునేందుకు నల్గొండకు వెళ్లిన మంగ్యా అక్కడ కూలీ పని చేసేవాడని తండా వాసులు తెలిపారు. సోమవారం ఉదయం ప్రైవేట్ బస్సు టైర్లు బస్ట్ అవ్వడంతో బైక్‌పై వెళ్తున్న మంగ్యాను ఢీకొట్టినట్లు వివరించారు. దీంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందినట్లు పేర్కొన్నారు. మంగ్యాకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
ఊడిన బస్సు టైరు : తప్పిన ప్రమాదం
జడ్చర్ల టౌన్: ఓ ఆర్టీసీ బస్సుకు ప్రమాదవశాత్తు టైరు ఊడిపోయింది. ఈ సంఘటన జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. టైరు ఊడిన సమయంలో రోడ్డుపై జనసంచారం, వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ముందు టైర్ ఊడిపోయింది. టైర్ ఊడిపోవడంతో బస్సు రోడ్డుపైనే ముందుకు వెళ్లలేకుండా కూలబడింది. బస్సు వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది. ఈ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. వాహనాలు సైతం రాకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు కుదుపునకు గురైనప్పటికీ ఎలాంటి రక్తగాయాలు కాలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్‌కు పంపించారు. రాత్రికి మెకానిక్‌లను పిలిచి మరమ్మతు చేయించుకుని బస్సును తిరిగి వనపర్తికి తీసుకెళ్లారు. -
టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసి బస్సు
నల్లగొండ :ఆర్టీసి బస్సు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి పక్కన పొలాల్లోకి దూసుకెళ్ళిన సంఘటన మంగళవారం ఉదయం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చోటుచేసుకుంది. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపుగా వెళుతుంది. మండలంలోని బుగ్గబావిగూడెం సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు రాగానే బస్సు ముందు కుడివైపు టైరు పేలిపోయింది. దీంతో వెంటనే బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో సహా 20మంది ప్రయాణీకులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.