రద్దయినా ‘రైట్‌’ రాయల్‌గా.. | Transport Department stoped not even one private bus | Sakshi
Sakshi News home page

రద్దయినా ‘రైట్‌’ రాయల్‌గా..

Published Tue, Jun 13 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

Transport Department stoped not even one private bus

- తెలుగు రాష్ట్రాల మధ్య ఆగని ‘అరుణాచల్‌’ బస్సుల పరుగులు
- ఒక్క ప్రైవేట్‌ బస్సును కూడా నిలువరించని రవాణా శాఖ
- ఏ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారంటూ అరుణాచల్‌కు మొక్కుబడి లేఖ
 
సాక్షి, హైదరాబాద్‌: ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై, ఇక్కడ పర్మిట్లు పొంది, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న టూరిస్టు బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి. ఆ బస్సులను స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించి రిపోర్టు చేయాల్సిందిగా వాటి యజమానులకు సూచించండి’’ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ సీరం జూన్‌ 6న స్థానిక జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీఓ)కు జారీ చేసిన ఆదేశాల సారాంశమిది. అరుణాచల్‌లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న సుమారు వెయ్యి బస్సులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కాబట్టి అవి రోడ్డెక్కడం చట్టరీత్యా నేరం. అయినా సరే, ఆ బస్సులన్నీ యథావిధిగా రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలూ ఎప్పట్లాగే తమ కార్యాలయాల ముందు బోర్డులు పెట్టి మరీ ఈ బస్సులకు టికెట్లు అమ్ముకుంటున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగులూ చేసు కుంటున్నాయి. అయినా తెలంగాణ రవాణా శాఖ అధికారులు మాత్రం ఒక్క బస్సునూ ఆపే ప్రయ త్నం చేయడం లేదు. అదేమంటే, ‘‘అరుణాచల్‌ ఆదేశాలు అందలేదు. అలాంటప్పుడు వాటిపై చర్య లెలా తీసుకుంటాం? ఎందుకాపారని రేపు కోర్టులు ప్రశ్నిస్తే ఏం బదులిస్తాం?’ అంటూ ప్రశ్నిస్తున్నారు!! ఒకవైపు అరుణాచల్‌ రవాణా శాఖ కమిషనరేమో తమ రాష్ట్రంలో రిజిస్టరై, పర్మిట్లు పొందిన బస్సులు నిర్ధారిత కాలంలో తమ భూభాగంలో తిరగాలన్న నిబంధనను పట్టించుకోకపోవడాన్ని  ప్రశ్నిస్తున్నా రు. బస్సులను భౌతికంగా తనిఖీ చేయకుండా పర్మి ట్లను ఎలా రెన్యువల్‌ చేస్తారన్న ప్రశ్ననూ ఆయన లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల అధికార గణం ఈమా త్రం హేతుబద్ధంగా కూడా ఆలోచించకపోగా, ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు లబ్ధి చేకూరేలా నిబంధనలను బేఖాతరు చేస్తుండటం విస్తుగొలుపుతోంది.
 
‘సాక్షి’ కథనంతో హడావుడిగా లేఖ
అరుణాచల్‌ ఆదేశం తమకు అందనందున ఏమీ చేయలేమన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తుండ టాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశమున్నా చర్యలు తీసుకోవటం లేదని పేర్కొంటూ సోమవారం ‘సాక్షి’లో కథనం రావడంతో రవాణా శాఖ హడావుడిగా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఏయే ట్రావెల్స్‌కు చెందిన ఏయే బస్సులపై చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అరుణాచల్‌ ప్రభుత్వానికి తెలంగాణ రవాణా శాఖ సోమవారం లేఖ రాసింది. ఇదే పని వారం క్రితమే చేసి ఉంటే ఈ పాటికి వివరాలందడమే గాక, చర్యలు కూడా తీసుకునే అవకాశముండేది.
 
ఇక్కడ రిజిస్టర్‌ చేస్తే ఉద్యమమే
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో 600 దాకా ఏసీ బస్సులున్నాయి. అవి 70% లోపే నిండుతున్నాయి. ప్రైవేటు బస్సులూ సాధారణ రోజుల్లో 30% ఖాళీగానే తిరుగుతున్నాయి. పైగా రెండు ఆర్టీసీలు ఇటీవలే వంద కొత్త బస్సులు కొన్నాయి. అంటే అరుణాచల్‌ నిర్ణయం ఫలితంగా 1,000 ప్రైవేటు బస్సులు ఆగిపోయినా ఇబ్బందేమీ లేదు. అయినా ప్రభుత్వాలు మాత్రం ఆర్టీసీలను కాదని ప్రైవేటు ట్రావెల్స్‌కే తాము సానుకూలమనే రీతిలోనే వ్యవహరిస్తున్నాయి. దీన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. అరుణాచల్‌ రద్దు చేసిన బస్సులను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్‌ చేయించుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే తాము ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చరి స్తున్నాయి. ఆ ప్రైవేటు బస్సులను కొను గోలు చేసి ఆర్టీసీలకు అప్పగించి నడిపిం చాలంటూ ఇరు ప్రభుత్వాలకు వినతిపత్రాలు కూడా సమర్పించాయి.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement