RTC trade unions
-
సమ్మె నోటీసు.. బెదిరింపు కాదు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతన సవరణ అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పక్కనపెట్టడంతో కార్మిక సంఘం నేతలు సందిగ్ధంలో పడ్డారు. నోటీసు ఇచ్చినంత మాత్రాన సమ్మెకు దిగినట్టు కాదని.. ఇది బెదిరింపో, బ్లాక్మెయిలింగో కాదని మంత్రివర్గ ఉప సంఘానికి విన్నవించుకున్నారు. తమ బాధను సహృదయంతో అర్థం చేసుకుని వేతన సవరణ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాలు వేతన సవరణ జరపాలని డిమాండ్ చేసే క్రమంలో ముందుగానే సమ్మె నోటీసు ఇవ్వడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు మార్గం సుగమం చేస్తూ బుధవారం రాత్రే సీఎం ప్రకటన చేశారు. ఇదే సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ గుర్తింపు కార్మిక సంఘం ముందుగానే సమ్మె నోటీసు ఇవ్వటం, దీనికి పోటీగా మిగతా సంఘాలు నోటీసు ఇవ్వటంతో ఆగ్రహించిన సీఎం కేసీఆర్... బుధవారం నాటి సమావేశంలో ఆర్టీసీ పీఆర్సీ అంశాన్ని పక్కన పెట్టారు. విలేకరుల సమావేశంలోనూ ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే చేసుకొమ్మనండి అని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ సమ్మెకు దిగితే అణచివేసే ధోరణితో ఉన్నట్టు ఆయన మాటలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రులను కలసి విజ్ఞప్తి.. సీఎం ఆగ్రహం నేపథ్యంలో మొదటికే మోసం వచ్చేలా ఉందని గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ముఖ్య నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వారు గురువారం మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులను విడివిడిగా కలిసి మాట్లాడారు. తాము ప్రభుత్వంపై అసంతృప్తిగా లేమని.. సమ్మె నోటీసు ఇచ్చినంత మాత్రాన సమ్మె చేస్తున్నట్టు కాదని వివరించారు. కార్మిక సంఘాలు ఇలా సమ్మె నోటీసు ఇవ్వటం ఓ ఆనవాయితీయే తప్ప బెదిరింపో, బ్లాక్మెయిలింగో కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్టు తెలిసింది. ఉద్యమకాలం నుంచి తాము కేసీఆర్‌తో కలసి ఉన్నామని, ఇప్పుడూ వెంట ఉన్నామని.. దీనిని సహృదయంతో అర్థం చేసుకుని తమ వేతన సవరణపై సానకూల నిర్ణయం తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆర్టీసీ పీఆర్సీపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఇప్పటికే రెండు దఫాలు కార్మిక సంఘం, అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే సీఎం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో నివేదిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశముంది. మొత్తంగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇప్పటికిప్పుడు ఫిట్మెంట్ ప్రకటించకుండా కొంత మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
రద్దయినా ‘రైట్’ రాయల్‌గా..
- తెలుగు రాష్ట్రాల మధ్య ఆగని ‘అరుణాచల్’ బస్సుల పరుగులు - ఒక్క ప్రైవేట్ బస్సును కూడా నిలువరించని రవాణా శాఖ - ఏ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారంటూ అరుణాచల్‌కు మొక్కుబడి లేఖ సాక్షి, హైదరాబాద్: ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై, ఇక్కడ పర్మిట్లు పొంది, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న టూరిస్టు బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి. ఆ బస్సులను స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించి రిపోర్టు చేయాల్సిందిగా వాటి యజమానులకు సూచించండి’’ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సీరం జూన్ 6న స్థానిక జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీఓ)కు జారీ చేసిన ఆదేశాల సారాంశమిది. అరుణాచల్‌లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న సుమారు వెయ్యి బస్సులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కాబట్టి అవి రోడ్డెక్కడం చట్టరీత్యా నేరం. అయినా సరే, ఆ బస్సులన్నీ యథావిధిగా రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలూ ఎప్పట్లాగే తమ కార్యాలయాల ముందు బోర్డులు పెట్టి మరీ ఈ బస్సులకు టికెట్లు అమ్ముకుంటున్నాయి. ఆన్లైన్ బుకింగులూ చేసు కుంటున్నాయి. అయినా తెలంగాణ రవాణా శాఖ అధికారులు మాత్రం ఒక్క బస్సునూ ఆపే ప్రయ త్నం చేయడం లేదు. అదేమంటే, ‘‘అరుణాచల్ ఆదేశాలు అందలేదు. అలాంటప్పుడు వాటిపై చర్య లెలా తీసుకుంటాం? ఎందుకాపారని రేపు కోర్టులు ప్రశ్నిస్తే ఏం బదులిస్తాం?’ అంటూ ప్రశ్నిస్తున్నారు!! ఒకవైపు అరుణాచల్ రవాణా శాఖ కమిషనరేమో తమ రాష్ట్రంలో రిజిస్టరై, పర్మిట్లు పొందిన బస్సులు నిర్ధారిత కాలంలో తమ భూభాగంలో తిరగాలన్న నిబంధనను పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నా రు. బస్సులను భౌతికంగా తనిఖీ చేయకుండా పర్మి ట్లను ఎలా రెన్యువల్ చేస్తారన్న ప్రశ్ననూ ఆయన లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల అధికార గణం ఈమా త్రం హేతుబద్ధంగా కూడా ఆలోచించకపోగా, ప్రైవేట్ ట్రావెల్స్‌కు లబ్ధి చేకూరేలా నిబంధనలను బేఖాతరు చేస్తుండటం విస్తుగొలుపుతోంది. ‘సాక్షి’ కథనంతో హడావుడిగా లేఖ అరుణాచల్ ఆదేశం తమకు అందనందున ఏమీ చేయలేమన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తుండ టాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశమున్నా చర్యలు తీసుకోవటం లేదని పేర్కొంటూ సోమవారం ‘సాక్షి’లో కథనం రావడంతో రవాణా శాఖ హడావుడిగా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఏయే ట్రావెల్స్‌కు చెందిన ఏయే బస్సులపై చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అరుణాచల్ ప్రభుత్వానికి తెలంగాణ రవాణా శాఖ సోమవారం లేఖ రాసింది. ఇదే పని వారం క్రితమే చేసి ఉంటే ఈ పాటికి వివరాలందడమే గాక, చర్యలు కూడా తీసుకునే అవకాశముండేది. ఇక్కడ రిజిస్టర్ చేస్తే ఉద్యమమే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో 600 దాకా ఏసీ బస్సులున్నాయి. అవి 70% లోపే నిండుతున్నాయి. ప్రైవేటు బస్సులూ సాధారణ రోజుల్లో 30% ఖాళీగానే తిరుగుతున్నాయి. పైగా రెండు ఆర్టీసీలు ఇటీవలే వంద కొత్త బస్సులు కొన్నాయి. అంటే అరుణాచల్ నిర్ణయం ఫలితంగా 1,000 ప్రైవేటు బస్సులు ఆగిపోయినా ఇబ్బందేమీ లేదు. అయినా ప్రభుత్వాలు మాత్రం ఆర్టీసీలను కాదని ప్రైవేటు ట్రావెల్స్‌కే తాము సానుకూలమనే రీతిలోనే వ్యవహరిస్తున్నాయి. దీన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. అరుణాచల్ రద్దు చేసిన బస్సులను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే తాము ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చరి స్తున్నాయి. ఆ ప్రైవేటు బస్సులను కొను గోలు చేసి ఆర్టీసీలకు అప్పగించి నడిపిం చాలంటూ ఇరు ప్రభుత్వాలకు వినతిపత్రాలు కూడా సమర్పించాయి. -
ఢిల్లీలో ‘ప్రైవేటు’ చక్కర్లు
- ట్రావెల్స్ యాజమాన్యాల కొత్త ఎత్తులు - 2 ప్లస్ 1 బెర్తుల విధానానికి అనుమతించేలా పైరవీలు - అరుణాచల్ నుంచి బస్సుల రిజిస్ట్రేషన్ మార్పుకోసం యత్నం - ఈలోగా చర్యలు లేకుండా తెలుగు ప్రభుత్వాలపై ఒత్తిడి - రంగంలోకి రాజకీయ నేతలు సాక్షి, హైదరాబాద్: తమ రాష్ట్రంలో రిజిస్టరై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను అరుణాచల్‌ప్రదేశ్ రద్దు చేయడంతో దిక్కుతోచని ట్రావెల్స్ నిర్వాహకులు ఢిల్లీ కేంద్రంగా పైరవీలకు దిగారు. ఆ బస్సులను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు 2 ప్లస్ 1 బెర్తుల విధానానికి కూడా (36 బెర్తులకు) ఇక్కడ అనుమతులు తెచ్చుకునే దిశగా చక్రం తిప్పుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 24 బెర్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇటీవల కేంద్రప్రభుత్వం రవాణా చట్టానికి స్వల్ప సవరణలు చేసింది. దీని ప్రకారం ఈ బెర్తుల సంఖ్యలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో అది 2 ప్లస్ 1 బెర్తుల విధానంలాగే ఉండేలా ఆదేశాలు జారీ చేయించడానికి ప్రైవేటు ఆపరేటర్లు రింగ్‌గా ఏర్పడి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆదేశాలు రాగానే తెలుగు రాష్ట్రాలనే కేంద్రంగా చేసు కుని ఎప్పటిలాగే బస్సులు తిప్పుకోవచ్చనేది వారి ఎత్తుగడ. ఆ వెంటనే అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా రద్దు చేయించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది ఆలోచన. కిమ్మనని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు... నిబంధనలు బేఖాతరు చేస్తున్న వెయ్యి బస్సులపై అరుణాచల్‌ప్రదేశ్ కన్నెర్ర చేస్తే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కిమ్మనటం లేదు. స్థానికంగా నిబంధనల ఊసే లేకుండా యథేచ్ఛగా ఆ ప్రైవేటు బస్సులు తిరుగుతున్నా చిన్న చర్య కూడా తీసుకోవటం లేదు. దీన్ని ఆసరా చేసుకున్న ఆపరేటర్లు... ఢిల్లీలో లాబీయింగ్ ఫలించేవరకు తమ బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చక్రం తిప్పినట్టు సమాచారం. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాలూకు ఆదేశాల కాపీ అందిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ రెండు రాష్ట్రాల రవాణాశాఖలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్ రవాణాశాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రతి అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆదేశాలు ‘అధికారికంగా’అందాల్సి ఉందంటున్నాయి. ఎన్ఓసీతో తంటా... అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లను ఉపసంహరిం చుకుని తెలుగురాష్ట్రాల్లో నమోదు చేసుకోవాలంటే ఆ రాష్ట్రప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అరుణాచల్‌ప్రదేశ్ రవాణా శాఖ ఎన్ఓసీ ఇవ్వటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ద్వారా కథ నడిపిం చాలని వాటి నిర్వాహకులు యత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన బడా నేతలు కొందరు ఆ ‘భారం’భుజాలకెత్తుకున్నట్టు తెలిసింది. అరుణాచల్ కన్నెర్ర.... తమ రాష్ట్రంలో రిజిస్టర్ చేయించుకున్న బస్సులు నిర్ధారిత సమయంలో కచ్చితంగా తమ భూ భాగంలోకి రావాలన్న నిబంధనను ఉల్లంఘించటం తో అరుణాచల్‌ప్రదేశ్ వెయ్యి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కన్నెర్ర చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ట్రావెల్స్ నిర్వాహకులు తమ బస్సులకు టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పు తున్నారు. చట్టరీత్యా ఇది నేరం. కానీ ఇక్కడి ప్రభుత్వాలు కిమ్మనటం లేదు. తెలంగాణ ఆర్టీసీ వీటి మూలంగా సాలీనా రూ.800 కోట్లు నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు రవాణాశాఖ–ఆర్టీసీకి సంయు క్తంగా ఓ నోడల్ అధికారిని స్వయంగా సీఎం కేసీఆరే నియమించినా లాభం లేకుండా పోయింది. అరుణా చల్‌ప్రదేశ్ ఉదంతం నేపథ్యంలో ఆర్టీసీ ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా చర్యలు కనిపించటం లేదు. ఆ బస్సులు రిజిస్టర్ చేస్తే ఆందోళన.. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వేటుపడ్డ ప్రైవేటు బస్సులకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే ఆందోళనకు దిగు తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అటువంటి యోచనను విరమించుకోవాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు ఒక ప్రకటన చేశారు. ఏమిటీ 2 ప్లస్ 1? అరుణాచల్‌ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో స్లీపర్ బస్సుల్లో 2 ప్లస్ 1 విధానంలో 36 బెర్తులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే బస్సులో ఆరు కంపార్ట్మెంట్లు... ఒక్కో దానిలో నాలుగు బెర్తులు ఏర్పాటు చేస్తారు. అంటే 24 బెర్తులు అవుతాయి. దీంతోపాటు మరోవైపు 12 సీట్లు ఏర్పాటు చేస్తారు. వాటిని కూడా స్లీపర్ సీట్లుగా పరిగణిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక్కో బస్సుకు పన్నురూపంలో ఏటా కేవలం రూ.18 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో వారు అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
ఆర్టీసీ కార్మికులపై ‘లాఠీ’ ప్రతాపం
హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్రుతంగా సాగింది. కొన్ని చోట్ల పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తంగా మారింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పురుషులు, మహిళలనే విచక్షణ లేకుండా తరిమి తరిమి చితకబాదారు. దీంతో యూనియన్ నేతలతో కలసి కార్మికులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. మరోపక్క లాఠీచార్జ్ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనేలా చేసింది. పలు జిల్లాల్లో బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. సమ్మెకు మద్దతు పలుకుతున్న ప్రజాసంఘాల నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలోనూ పోలీసులు రెచ్చిపోయారు. ఆర్టీసీ కార్మికులను విచ్చలవిడిగా అరెస్ట్ చేశారు. ఫలితంగా రోడ్డు రవాణా సమ్మె.. రాష్ట్రంలో పతాకస్థాయికి చేరింది. మరోపక్క, తాత్కాలిక ప్రాతిపదికన విశాఖపట్నం డిపోలో నియమితుడైన ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. నేడు వంటా వార్పూ..: శనివారం ఏపీ వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ఆవరణల్లోనూ ‘వంటా వార్పూ’ చేపట్టాలని యూని యన్ నే తలు పిలుపునిచ్చారు. కార్మికులపై పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా ఈయూ నేత కె.పద్మాకర్ ఆర్టీసీ డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు. -
కదలని ‘చక్రం’
నల్లగొండ : వేతనాలు సవరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. అన్ని డిపోల ఎదుట కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు బైఠాయిం చి నిరసన వ్యక్తం చేశారు. బస్సులు నడిపేందుకు అధికారులు తీసుకున్న చర్యలను సైతం కార్మిక సంఘాలు తిప్పికొట్టాయి. ఈ సమ్మెలో డ్రైవర్లు, కండక్టర్లు కలిపి మూడు వే ల మంది పాల్గొన్నారు. సంఘాలకు మద్దతు గా ఆయా డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సూపర్వైజర్లు కూడా విధులు బహిష్కరించారు. దీంతో జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంతో పాటు, అన్ని డిపోల్లో సేవలు స్తంభించిపోయాయి. అయితే ఈ సమ్మెలో క్యాజువల్ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొనడాన్ని ఆర్టీసీ యాజమాన్యం తప్పుపట్టింది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆర్ఎం బి. రవీందర్ కోరారు. వెనక్కొచ్చిన బస్సులు... రీజియన్ పరిధిలో వివిధ మార్గాల్లో 53 అద్దెబస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రవాణా శాఖ కూడా 25 మంది ప్రైవేటు డ్రైవర్లను అందుబాటులో ఉంచారు. కానీ కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో బస్సులు తిరిగి డిపోలకే వచ్చిచేరాయి. నల్లగొండ-దేవరకొండ మార్గంలో వెళ్తున్న బస్సును నల్లగొండ సాగర్ క్రాస్ రోడ్డు వద్ద సంఘాల నాయకులు అడ్డుకుని డ్రైవర్‌ను బెదిరించారు. అదే విధంగా నల్లగొండ డిపో నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా కార్మిక సంఘాలు డిపో ఎదుట బైఠాయించాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లకు పూనుకున్నారు. జిల్లా మీదుగా నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు కాకుండా రీజియన్ పరిధిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఉదయం నుంచి అన్ని డిపోల్లో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. న ల్లగొండ, యాదగిరిగుట్ట, సూర్యాపేట, మిర్యాలగూడ డిపోల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రవాణా శాఖ సహాయంతో లెసైన్సు కలిగిన ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను కూడా తీసుకొస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు సహాయంతో బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు వాహనాల దోపిడీ... వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయ, రాష్ట్ర రహదారుల మీద ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. బుధవారం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ప్రయాణికులకు పగటిపూట చుక్కలు కనిపించాయి. దీనిన్నే అదునుగా భావించిన ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాలు, కార్లు, జీపులు రోడ్ల మీదకు దూసుకొచ్చాయి.భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, భువనగిరి పట్టణం, మండలాల్లోని ప్రయాణి కులు బస్సుల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఆటోలు, క్రూజర్లు, టాటా ఏస్‌లు ప్రయాణికుల రద్దీతో నడిచాయి. హైదరాబాద్, వరంగల్, మోత్కూర్, నల్లగొండ, గజ్వెల్ మార్గాల్లో ఆటోల్లో, ఇతర వాహనాల్లో కిక్కిరిసిపోయారు. దూర ప్రాంతాలకు టికెట్ ధరలను పెంచేశారు. మిర్యాలగూడ బస్టాండ్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు. డిపోలో తాత్కాలిక డ్రెవర్లు, కం డక్టర్లకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన వారిని సంఘ నా యకులు అడ్డుకున్నారు. కాగా ఇరువర్గాల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. సుమారు 200 మంది నిరుద్యోగులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు దఖాస్తులు చేసుకున్నారు.దేవరకొండ డిపోలో కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సంఘీభావం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో ఘర్షణలు జరిగినట్లు పుకార్లు రావడంతో డీఎస్పీ చంద్రమోహన్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెతో బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోదాడ డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రానివ్వలేదు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లిన కొన్ని బస్సులు తిరిగి విజయవాడకు వెళ్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. ప్రయాణికులను దింపేసి ఖాళీ బస్సులను పంపించారు. తాత్కాలిక డ్రై వర్లు, కండక్టర్లను నియమిస్తామని చెప్పడంతో కొంత మంది నిరుద్యోగులు డిపో వద్దకు రావడంతో వారిని కార్మికులు అడ్డుకొని వెనక్కు పంపించారు. కోదాడ ప ట్టణ పోలీసులు డిపో వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సూర్యాపేటలో ఎండవేడిమికి తాళలేక ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించి వారి వారి ప్రాంతాలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రై వేట్ ట్రావెల్స్ వారు అధిక చార్జీలు వసూలు చేసి ప్రయాణికుల నడ్డి విరిచారు. పెళ్లిల సీజన్ కావడం.. వేసవి సెలవుల వల్ల బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. రూ.65 లక్షల నష్టం జిల్లా రీజియన్ పరిధిలో 760 బస్సులు ఉన్నాయి. ఇవి నిత్యం 256 మార్గాల్లో ప్రయాణిస్తుంటాయి. జిల్లా మీదుగా రోజూ 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రీజియన్ రోజు వారి ఆదాయం రూ.65 లక్షలు. వేసవి సెలవులు, పెళ్లిళ్లు కావడంతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ సమ్మె వల్ల రూ.65 లక్షలు నష్టం వాటిల్లింది. -
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
-
ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు
-
చక్రాలకు బ్రేక్
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ► కార్మికుల వేతన సవరణపై చర్చలు విఫలం ► 27% ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామన్న ప్రభుత్వం ► 43% ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక సంఘాల పట్టు ► రోజంతా చర్చోపచర్చలు.. హైడ్రామా ► మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న సర్కారు ► సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం ► ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు ►సూపర్వైజర్లూ లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు విఘాతం ► {పయాణికులకు తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్: ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే సర్వీసులన్నీ ఆగిపోయాయి. 27 శాతంగా ఉన్న మధ్యంతర భృతి(ఐఆర్)ని ఫిట్‌మెంట్‌గా మారుస్తామని, మెరుగైన వేతన సవరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాలు తోసిపుచ్చడంతో సమ్మె అనివార్యమైంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో బస్సు సర్వీసులకు అంతరాయం ఎదురైంది. ప్రయాణికులకు ఇక్కట్లు మొదలయ్యాయి. చివరిరోజు హైరానా...: మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధం కాగా.. అప్పటి వరకు చోద్యం చూసిన రాష్ర్ట ప్రభుత్వం చివరిరోజున హడావుడి చేసింది. ఉదయం బస్‌భవన్‌లో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)-తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమి ప్రతినిధులతో సంస్థ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 43 శాతం ఫిట్మెంట్ కోసం పట్టుబట్టడం సరికాదని ఎండీ పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని, దాన్ని వేతన సవరణ కు ముడిపెట్టడం సరికాదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న 27 శాతం ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామని యాజమాన్యం ప్రకటించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించి కార్మిక సంఘాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 43 శాతం వేతన సవరణకు పట్టుబట్టడం సరికాదని, దాదాపు రూ.850 కోట్ల భారం పడుతున్నప్పటికీ 27 శాతం ఫిట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు పట్టువీడాలని, సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెళ్లాయి. కాగా, సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, 43 శాతం ఫిట్మెంట్తో పడే భారం, నిధుల సమీకరణ యత్నాలు వంటి వివరాలను ఆయన ముందుంచారు. అప్పటికే ఓ నిర్ణయంతో ఉన్న ముఖ్యమంత్రి.. వెంటనే కార్మిక సంఘం నేతలతో చర్చించాల్సిందిగా మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిని పురమాయించారు. దీంతో నాయిని చాంబర్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాలయాపనతో గందరగోళం... 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించకుంటే సమ్మెకు దిగుతామని పక్షం రోజుల క్రితమే ఆర్టీసీ గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి నోటీసు ఇచ్చింది. ఆ వెంటనే ఎండీ సాంబశివరావు వారితో చర్చించి అంత ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఆర్టీసీపై రూ.1800 కోట్ల భారం పడుతుందని, దాన్ని భరించే శక్తి ఆర్టీసీకి లేదని తేల్చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భరిస్తేనే ఆ మేరకు పెంపు సాధ్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చివరి వరకూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దారితీసింది. రంగంలోకి ప్రైవేట్ డ్రైవర్లు సమ్మె అనివార్యమైతే ఒక్క రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం కావద్దన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల క్రితమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లను సమీకరించింది. అందుబాటులో ఉన్న డ్రైవర్లను గుర్తించి ఆర్టీసీకి కేటాయించాల్సిందిగా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇలా ఇప్పటివరకు సమీకరించిన దాదాపు ఐదు వేల మంది ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దింపారు. మరో ఐదు వేల మందిని రెండు రోజుల్లో నియమించే పనిలోపడ్డారు. ప్రైవేటు డ్రైవర్లకు రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కండక్టర్ విధులు నిర్వర్తించే వారికి రూ.800 చొప్పున చెల్లిస్తారు. అలాగే ప్రైవేటు వాహనాలు, ఓమ్ని బస్సులకు స్టేజీ క్యారియర్‌గా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఒక్కో వాహనం ప్రత్యేక ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం ఉత్తర్వులు జారీకానున్నాయి. సూపర్వైజర్లూ లేకపోతే ఇబ్బందే కార్మికులతో పాటు ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం కూడా సమ్మె బాట పట్టడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. కానీ అలా వచ్చే డ్రైవర్లకు సూచనలు చేయాలన్నా, వారిని నియంత్రించాలన్నా, వారి డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరిశీలించాలన్నా డిపోలో సిబ్బంది అవసరం. కానీ దాదాపు అన్ని విభాగాల సిబ్బంది సమ్మెకు దిగారు. డిపో మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది మినహా మరెవరూ విధుల్లో లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడపడం కుదిరేలా కనిపించడం లేదు. ఎన్నికల వేళ కార్మిక సంఘాల పట్టు వేతన సవరణ విషయంలో గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి బెట్టు వీడకపోవడానికి కారణం ఎన్నికలే. ప్రస్తుత గుర్తింపు యూనియన్ గడువు తీరిపోయింది. దీంతో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో వేతన సవరణపై బెట్టు వీడితే కార్మికుల్లో చెడ్డ పేరు వస్తుందని గుర్తింపు సంఘం కూటమి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ వాదనకు తలొగ్గి సమస్యను కొనితెచ్చుకోవద్దన్న అభిప్రాయంతోనే సమ్మెకు దారితీసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావాలంటే 62 శాతం ఫిట్మెంట్ కావాలని, అయితే గుర్తింపు సంఘం మాత్రం 43 శాతమే డిమాండ్ చేసి కార్మికులకు అన్యాయం చేసిందంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే దాడి ప్రారంభించింది. చార్జీలు 40 శాతం పెంచాల్సి వస్తుంది ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నందున సమ్మె వద్దని సర్కారు చేసిన విన్నపాన్ని కార్మిక సంఘాలు మొండిగా తిరస్కరించాయి. సమస్యల పరిష్కారానికి మరింత గడువు కోరినా వినలేదు. 43 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలంటే దాదాపు 40 శాతం వరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుంది. ఇంతభారం ప్రజలపై మోపడం సరికాదు. ఆర్టీసీని కూడా లాభాల బాట పట్టించే పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. దాన్ని అమలు చేసి భవిష్యత్తులో లాభాలు వస్తే కార్మికులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అయినా సమ్మెకు దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాం. - రాష్ర్ట రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పటికే కాలయాపన ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు దాటినా స్పందించలేదు. ఇప్పుడు గడువు కోరడం దాటవేసేందుకే. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకూ సమ్మె విరమించేది లేదు. జీతాలు పెంచితే 40 శాతం చార్జీలు పెంచాలన్న వాదన అసత్యం. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి పక్కదారి పట్టిస్తోంది. నిర్వహణ మా చేతికిస్తే పైసా చార్జీలు పెంచకుండా జీతాలు పెంచుకుంటాం. డీజిల్, రవాణా పన్ను రూపేణ ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ఏటా రూ. 400 కోట్లు వసూలు చేస్తోంది. పైగా పలు వర్గాలకు ఇస్తున్న రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించడం లేదు. రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించి, మూడేళ్ల పన్ను మినహాయింపునిస్తే చాలు ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త రాష్ట్రంలో జీతాలు పెరిగాయి. మేం ఏం పాపం చేశాం. తెలంగాణ కోసం చాలా పోరాటం చేశాం. ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితి తెలుసు. ఆయన చొరవ తీసుకుని సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది. అప్పటి వరకు సమ్మె వల్ల ప్రజలు పడే ఇబ్బందులకు యాజమాన్యమే బాధ్యత వహించాలి. సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లను, అడ్డా కూలీలను వినియోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. -- కార్మిక సంఘాల నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి ఏపీలోనూ నిలిచిన బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైంది. రాష్ట్రంలోని 126 బస్సు డిపోలు, నాలుగు వర్క్‌షాపుల్లో ఇది కొనసాగనుంది. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ర్ట రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. ప్రైవేటు బస్సుల యజమానులతో, దక్షిణ మధ్య రైల్వేతో మాట్లాడుతామని పేర్కొన్నారు. సమ్మెపై కేబినెట్లో చర్చించామని, సీఎం వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రిలోగా కార్మిక సంఘాలతో చర్చించి సమ్మె విరమణకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీ ఆర్టీసీలో 68 వేల మంది కార్మికులు ఉన్నారని, వీరికి ఫిట్మెంట్ ప్రకటించాలంటే బస్సు చార్జీలను కనీసం 15 శాతం పెంచాలని సీఎం చంద్రబాబు ద ృష్టికి తీసుకెళ్లామని, అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీకి అన్ని విషయాలు చెప్పి కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకోవాలన్నారు. మరోవైపు ఆర్టీసీలో వేతన సవరణ, సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం ఆర్థిక, రవాణా, కార్మిక శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 15లోగా ఈ మంత్రుల కమిటీ నివేదిక సమర్పిస్తుంది. 10,800 రాష్ట్రంలో నిలిచిపోనున్న బస్సులు 94 మొత్తం డిపోలు 2 వర్క్ షాపులు 57,500 కార్మికుల సంఖ్య -
ఆర్టీసీ ఎండీకే ఎస్పీవీల చైర్మన్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) నిధులతో కొనుగోలు చేసే బస్సుల నిర్వహణకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటులో ఆర్టీసీ అధికారుల ఆజమాయిషీనే ఉండాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపల్ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన ఎస్పీవీలు ఉండాలనే నిబంధనను వ్యతిరేకించాయి. ఆర్టీసీ ఎండీనే ఎస్పీవీలకు చైర్మన్‌గా ఉండాలని, ఆర్టీసీ ఈడీ ఎండీగా కలిపి ఏడుగురు సభ్యులకుగాను ఐదుగురు ఆర్టీసీ అధికారులే ఉండేలా చూడాలని, ఇద్దరు మాత్రమే ప్రభుత్వ అధికారులుండాలని డిమాండ్ చేశాయి. ఇందుకు బెంగళూరులో విజయవంతంగా అమలవుతున్న ఎస్పీవీల విధానాన్ని అనుసరించొచ్చేమో పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిరావాలని సూచించాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఈ మేరకు బోర్డుకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీవీల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర పడింది. జేఎన్ఎన్యూఆర్ఎం నిధులను పట్టణ ప్రాంతాలకే వినియోగించాల్సి ఉన్నందున ఆ నిధులతో కొనే బస్సులను పట్టణాల్లోనే తిప్పాల్సి ఉంది. దీంతో 4 ఎస్పీవీలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోకి వీలైనన్ని ప్రాంతాలను తీసుకురావాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ ఎస్పీవీ, విజయవాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలతో విజయవాడ ఎస్పీవీ, వరంగల్ ఆర్టీసీ జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలతో వరంగల్ ఎస్పీవీ, రాయలసీమ జిల్లాలతో కడప ఎస్పీవీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.