హైదరాబాద్లోని దిల్సుక్ నగర్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్: హైదరాబాద్లోని దిల్సుక్ నగర్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి సమయంలో అదుపుతప్పి రెండు బైక్లను ఢీకొట్టడంతొ ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు.