హైదరాబాద్: ఓ పెళ్లి బస్సు నీటిలో చిక్కుకుంది. కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీటిలో పెళ్లిబస్సు చిక్కుకుపోయింది. సోమవారం బోరబండ నుంచి కోటపల్లి వెళ్తుండగా రైల్వే బ్రిడ్జి కింది వర్షపు నీటిలో బస్సు చిక్కుకుంది.
నీటిలో బస్సు ఆగిపోవడంతో పెళ్లి బృందం దిగిపోయింది. బస్సు మునగక ముందే బస్సులో ఉన్న వారు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, తెల్లారేసరికి ఆ బస్సు దాదాపు మునిగిపోయింది.ఆ బస్సును నీటి నుంచి తీయడానికి చర్యలు చేపట్టారు. ఆ బ్రిడ్జి కింద ఇక నుంచి నీళ్లు ఆగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment