
లోయలోపడ్డ విజయవాడ బస్సు.. పలువురికి గాయాలు
విశాఖపట్నం: శబరిమల వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 53 మంది అయ్యప్ప భక్తులకు గాయలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు(ఏపీ 02 టీఏ5112)లో ఏపీకి చెందిన భక్తులు శబరిమలకు బయలుదేరారు. అయితే, ప్రమాదవశాత్తూ వీరు వెళ్తున్న బస్సు తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో లోయలో పడిపోయినట్లు సమాచారం.
బస్సులో ప్రయాణిస్తున్న 53 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. బాధితులంతా విశాఖ జిల్లా కాశింకోట మండలం పేరింటాళ్లపాలెంకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. బస్సు ప్రమాదం ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు,అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆరా తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.