
104 మందితో వెళుతున్న బస్సు సీజ్
గచ్చిబౌలి: ఆ బస్సు కెపాసిటీ 45, అంతకు మించి మహా అయితే పదో, 15 మందిని తరలించవచ్చు. అయితే ఓ ప్రైవేట్ బస్సులో ఏకంగా 104 మంది కూలీలు వెళ్లడం ఐటీ కారిడార్‌లో సోమవారం వెలుగు చూసింది. షాపూర్జీ పల్లంజి కంపెనీలో పని చేసే కూలీలు నానక్‌రాంగూడలోని లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నానక్‌రాంగూడ నుంచి మాదాపూర్ వైపు సోమవారం ఉదయం కూలీలతో వెళుతున్న ప్రైవేట్ బస్సును గచ్చిబౌలి జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ రఘుకుమార్ ఆపారు. కూలీలను కిందికు దించి లెక్కించగా ఏకంగా 104 మంది కూలీలు ఉన్నారు. దీంతో అవాక్కైన ఎస్‌ఐ బస్సును సీజ్ చేసి ఆర్‌టీఏ అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment