
తుమకూరు : నగరంలోని క్యాత్సంద్ర జాస్ టోల్‌గేట్ వద్ద ఆదివారం రాత్రి పోలీసులు ఓ ప్రైవేట్ బస్సు నుంచి రూ. 2 కోట్ల 98 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు తేదీ సమీపిస్తుండటంతో అధికారులు టోల్‌గేట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. బెంగళూరు నుంచి శివమొగ్గ–సొరబ మార్గంలో శిరసికి వెళ్తున్న గజానన అనే స్లీపర్ కోచ్ బస్సు రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరు బయలుదేరింది. తుమకూరు సమీపంలోకి రాగానే టోల్‌ప్లాజా వద్ద సెక్టర్ సర్వేలెన్స్ అధికారి గంగాధర్, ఫ్లైయింగ్ టీం అధికారి ప్రశాంత్, ఇతర అధికారుల బృందం అర్ధరాత్రి బస్సును నిలిపి తనిఖీ చేశారు.
రెండు బ్యాగుల్లో సోదాలు చేయగా ఒక బ్యాగ్‌లో రూ. 2000 నోట్లు 97 బండిల్స్, రూ. 500 నోట్లు 209 బండిల్స్ బయటపడ్డాయి. మొత్తం రూ. 2.98 కోట్లు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌పీ దివ్యా గోపీనాథ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. అయితే నగదుకు సంబంధించిన వారు ఎవరూ బస్సులో లేరు. దీంతో ఎస్‌పీ దివ్యా, డీఎస్‌పీ నాగరాజు, ఐటీ అధికారి భువనేశ్వరి నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను సిద్దగంగ మఠానికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులకు మరోబస్సు ఏర్పాటు చేసి వారి ప్రాంతాలకు పంపించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment