ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్‌పూర్-బులంద్‌షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్‌ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment