ఘోర ప్రమాదం : బస్సు - టిప్పర్ ఢీ | Road accident in sangareddy | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం : బస్సు - టిప్పర్ ఢీ

Published Sat, Mar 10 2018 7:39 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Road accident in sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ఆల్గోల్‌ బైపాస్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆల్గోల్‌ బైపాస్‌ క్రాస్‌ రోడ్డు టిప్పర్‌ లారీని ఢీకొట్టింది.  బైపాస్‌రోడ్డులోని అల్గోల్‌ కూడలిలో ముంబయి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు రోడ్డు దాటుతున్న టిప్పర్‌ను అదుపుతప్పి ఢీకొట్టింది. అనంతరం బస్సు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులోని ఇద్దరు డ్రైవర్లతో సహా మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జహీరాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement