Tripper driver
-
మా అభ్యర్థులు ఒకరు టిప్పర్ డ్రైవర్, మరొకరు కూలీ..బాబుకు అదిరిపోయే కౌంటర్..
-
పాముని కాపాడేందుకు బ్రేక్ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు
బెంగళూరు: పాముని రక్షించేందకని బ్రేక్ వేయడంతో వరసగా ఐదు వాహనాలు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు కంటైనర్ ట్రక్కు డ్రైవర్ బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి పాము ఒక్కసారిగా రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న మరోట్రక్కు టాటా ఏస్, ఒక టిప్పర్, బండరాళ్లను తరలిస్తున్న మరో మినీ టిప్పర్ ఒక్కసారిగా ఒకదాని వెనుక ఒకటి ఘోరంగా ఢీ కొన్నాయి. ఐతే ఈ ప్రమాదంలో పలువురు డ్రైవర్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఆ పాము ట్రక్కు చక్రం కిందకు వచ్చినప్పటికీ హైవే పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. (చదవండి: యూఎస్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా 18 ఏళ్ల యువకుడు) -
ఘోర ప్రమాదం : బస్సు - టిప్పర్ ఢీ
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ఆల్గోల్ బైపాస్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆల్గోల్ బైపాస్ క్రాస్ రోడ్డు టిప్పర్ లారీని ఢీకొట్టింది. బైపాస్‌రోడ్డులోని అల్గోల్ కూడలిలో ముంబయి నుంచి హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బస్సు రోడ్డు దాటుతున్న టిప్పర్‌ను అదుపుతప్పి ఢీకొట్టింది. అనంతరం బస్సు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులోని ఇద్దరు డ్రైవర్లతో సహా మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టిప్పర్ డ్రైవర్ సజీవదహనం
మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం ఇరసనగండ్లలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగిలి టిప్పర్ దగ్ధం అయింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ నరేశ్ సజీవ దహనమమయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.